Kapil Dev: రోహిత్ బరువుపై కపిల్‌ సంచలన వ్యాఖ్యలు.. సిగ్గుండాలంటూ కోహ్లీతో పోలిక.. ఫైరవుతోన్న హిట్‌మ్యాన్ ఫ్యాన్స్

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై మాట్లాడిన ఆయన రోహిత్‌ శర్మ ఓవర్‌ వెయిట్‌పై తీవ్ర అసహసనం వ్యక్తం చేశాడు. లావుగా ఉన్నందుకు రోహిత్‌ సిగ్గు పడాలని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

Kapil Dev: రోహిత్ బరువుపై కపిల్‌ సంచలన వ్యాఖ్యలు.. సిగ్గుండాలంటూ కోహ్లీతో పోలిక.. ఫైరవుతోన్న హిట్‌మ్యాన్ ఫ్యాన్స్
Kapil Dev, Rohit Sharma

Updated on: Feb 24, 2023 | 6:18 AM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై మాట్లాడిన ఆయన రోహిత్‌ శర్మ ఓవర్‌ వెయిట్‌పై తీవ్ర అసహసనం వ్యక్తం చేశాడు. లావుగా ఉన్నందుకు రోహిత్‌ సిగ్గు పడాలని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీవీల్లో చూస్తే హిట్‌మ్యాన్‌ అస్సలు ఫిట్‌గా కనిపిం‍చడని, 140 కోట్లకు పైగా భారతీయులకు ప్రాతినిథ్యం వహించే టీమిండియా కెప్టెన్‌ ఫిట్‌గా లేకపోవడం అవమానకరమన్నాడు. పనిలో పనిగా రోహిత్‌ను ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ విరాట్‌ కోహ్లితో పోల్చి ఇరువురు స్టార్‌ క్రికెటర్ల ఫ్యాన్స్‌ కొట్టుకునేందుకు తగిన కంటెంట్‌ అందించాడు. నాయకుడు అనేవాడు జట్టు సభ్యులకు ఆదర్శంగా ఉండాలని, ఈ విషయంలో కోహ్లి యావత్‌ క్రీడా ప్రపంచానికే ఆదర్శమని రన్‌మెషిన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఫిట్‌గా ఉండటం ఏ క్రీడకారుడికైనా చాలా ముఖ్యం. ఈ విషయంలో జట్టు కెప్టెన్‌ సభ్యులకు ఆదర్శంగా ఉండాలి. బరువు విషయంలో రోహిత్‌ ఇకనైనా జాగ్రత్త పడాలి. ఓవర్‌ వెయిట్‌ తగ్గించుకునేందుకు ఎక్స్‌ట్రా ఎఫర్ట్‌ పెడితే కానీ ఇది సాధ్యపడదు. రోహిత్‌ గొప్ప ఆటగాడు, గొప్ప కెప్టెన్‌ అన్న విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కనీసం టీవీల్లోనైనా సన్నగా కనిపించేందుకు కావాల్సిన కసరత్తులు రోహిత్‌ చేయాలి’ అని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు కపిల్‌ దేవ్‌.

కాగా రోహిత్‌పై కపిల్‌ దేవ్‌ ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశాడో కానీ, హిట్‌మ్యాన్‌ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాలో రోహిత్‌-కోహ్లి అభిమానులు ఒకరిపై ఒకరు ట్రోల్స్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్‌ను విరాట్‌తో పోల్చుతూ కపిల్‌ మళ్లీ ఇరు వర్గాల మధ్య అగ్గి రాజేసినట్లయ్యింది. ప్రస్తుతం ఈ దిగ్గజ క్రికెటర్‌ కామెంట్లు హాట్‌ టాపిక్‌గా మారాయి. బాడీ షేమింగ్‌ చేయడం కరెక్ట్‌ కాదని, ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే చెప్పాల్సిన పద్దతి ఇది కాదంటూ కపిల్‌కు చురకలంటిస్తున్నారు హిట్‌ మ్యాన్‌ ఫ్యాన్స్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..