ashes series 2021: యాషెస్‌ సిరీస్‎కు జట్టును ప్రకటించిన ఈసీబీ.. జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..

|

Oct 10, 2021 | 6:16 PM

ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులకు పండుగే.. ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్‌ 8 నుంచి జనవరి 18 వరకు యాషెస్‌ సిరీస్‌ జరుగనుంది...

ashes series 2021: యాషెస్‌ సిరీస్‎కు జట్టును ప్రకటించిన ఈసీబీ.. జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..
Ecb
Follow us on

ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులకు పండుగే.. ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్‌ 8 నుంచి జనవరి 18 వరకు యాషెస్‌ సిరీస్‌ జరుగనుంది. ఈ సిరీస్‎కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఆదివారం 17 మంది కూడిన ఆటగాళ్ల జాబితాను ఈసీబీ ప్రకటించింది. జోస్ బట్లర్ సిరీస్‎కు అందుబాటులో ఉండడని మొదటగా వార్తలు వచ్చాయి. కానీ అతన్ని జట్టుకు ఎంపిక చేశారు. జట్టులో బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‎కు చోటు దక్కలేదు.

ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఈ ఏడాది భారత్‌లో జరిగిన ఐపీఎల్‌-2021 తొలి దశ సందర్భంగా స్టోక్స్‌ గాయపడ్డాడు. ఆ సమయంలో అతను గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. అతను ఐపీఎల్ రెండోదశతోపాటు, టీ20 వరల్డ్ కప్ కూడా ఆడటంలేదు. అతని గాయం ఇంకా ఉండటంతో అతడిని సెలెక్ట్ చేయలేదు. మరో ఆల్ రౌండర్ సామ్ కరన్ ఐపీఎల్ గాయపడ్డాడు. అతడు వెన్ను నొప్పితో బాధపడుతుండడంతో అతన్ని కూడా ఎంపిక చేయలేదని ఈసీబీ తెలిపింది. అయితే ప్రముఖ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆగస్టులో భారత్‌తో జరిగిన మొదటి టెస్టు తర్వాత గాయపడ్డ బ్రాడ్ త్వరగా కోలుకున్నాడని తెలిపింది. వచ్చే వారం లాఫ్‌బరోలోని ఈసీబీ పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో బౌలింగ్‌కు తిరిగి రాబోతున్నాడని పేర్కొంది. .

ఇంగ్లాండ్ జట్టులో జో రూట్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జోనాథన్ బెయిర్‌స్టో, డోమ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్ క్రాలీ, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, దావీద్ మలాన్, క్రెయిగ్ ఓవర్టన్, ఒల్లీ పోప్ , ఒల్లీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ ఉన్నారు. ఇంకా ఆస్ట్రేలియా జట్టును ప్రకటించాల్సి ఉంది.

 

Read Also..  T20 World Cup: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్‎కు బంపర్ ఆఫర్.. భారత నెట్ బౌలర్‎గా ఉమ్రాన్ మాలిక్ ఎంపిక..!