
జాంటీ రోడ్స్ పేరు వినగానే క్రికెట్ అభిమానులకు వెంటనే గుర్తుకు వచ్చే విషయం అతని అసాధారణమైన ఫీల్డింగ్. దక్షిణాఫ్రికా జట్టును ప్రాతినిధ్యం వహించిన రోడ్స్, ప్రపంచ క్రికెట్‌లో గొప్ప ఫీల్డర్‌గా పేరు సంపాదించాడు. అతని వేగం, చురుకుదనం, గాల్లో ఎగురుతూ క్యాచ్‌లు అందుకోవడం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. 1970 జూలై 27న జన్మించిన జాంటీ రోడ్స్, 1992లో దక్షిణాఫ్రికా జట్టులోకి అడుగుపెట్టాడు. 1992 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఇంజమామ్-ఉల్-హక్‌ను రన్ అవుట్ చేసిన తీరు క్రికెట్ ప్రేమికుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అది అతని ఫీల్డింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పిన సందర్భం.
అయితే తాజాగా జాంటీ రోడ్స్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 11వ మ్యాచ్‌లో తన ప్రతిభను మరోసారి చాటిచెప్పాడు. ఆస్ట్రేలియా మాస్టర్స్, దక్షిణాఫ్రికా మాస్టర్స్ తలపడాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాస్టర్స్ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ షేన్ వాట్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబరచి టోర్నమెంట్‌లో తన మూడో సెంచరీ నమోదు చేశాడు. అతను 61 బంతుల్లో 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా లెజెండ్ జాంటీ రోడ్స్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. క్రికెట్ ఫ్యాన్స్‌కు జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ ప్రతిభ గురించి తెలిసిందే. మైదానంలో అతని వేగం, చురుకుదనం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గాల్లో ఎగురుతూ బంతిని అద్భుతంగా అడ్డుకున్న రోడ్స్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే, టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మాస్టర్స్ కెప్టెన్ జాక్వెస్ కల్లిస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మాస్టర్స్ 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి 260 పరుగులు చేసింది. వాట్సన్ (122*) అజేయంగా నిలవగా, ఫెర్గూసన్ 85, బెన్ డంక్ 34 పరుగులతో రాణించారు.
261 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మాస్టర్స్ 17 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. హషీమ్ ఆమ్లా 30 పరుగులు చేయగా, ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా మాస్టర్స్ బౌలర్లు అదిరిపోయే ప్రదర్శన ఇచ్చి తమ జట్టుకు విజయాన్ని అందించారు.
THE FIELDING EFFORT OF JONTY RHODES AT THE AGE OF 55 IN IMLT20 🤯 pic.twitter.com/1Wpzs5KrgW
— Johns. (@CricCrazyJohns) March 7, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి