అతడిని తక్కువ స్కోరుకే ఔట్ చేయాలి.. లేదంటే అత్యంత డేంజర్.. టీమిండియా బ్యాట్స్‌మెన్ పై ఇంగ్లాండ్ బౌలర్ కామెంట్స్..

|

Mar 14, 2021 | 7:34 AM

Jofra Archer Coments: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని ఇంగ్లాండ్ పాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అభిప్రాయపడ్డాడు. విరాట్ అత్యంత డేంజర్

అతడిని తక్కువ స్కోరుకే ఔట్ చేయాలి.. లేదంటే అత్యంత డేంజర్.. టీమిండియా బ్యాట్స్‌మెన్ పై  ఇంగ్లాండ్ బౌలర్ కామెంట్స్..
Jofra Archer Coments
Follow us on

Jofra Archer Coments: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని ఇంగ్లాండ్ పాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అభిప్రాయపడ్డాడు. విరాట్ అత్యంత డేంజర్ బ్యాట్స్‌మెన్ అని అతడు ఎక్కువ సేపు క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నాడు. అందుకు అతడిని తక్కువ స్కోరుకే ఔట్ చేయడం ఇంగ్లాండ్‌కు బోనస్ పాయింట్ అని చెప్పుకొచ్చాడు.

అయితే తగ్గట్లుగా విరాట్ విఫలమవుతుండటంతో జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్‌లో అతడు డకౌట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గతంలో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో కూడా వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో పరుగులు సాధించకుండానే పెవిలియన్ చేరాడు. విరాట్ పెద్ద స్కోర్లు సాధించకుండా ఇంగ్లాండ్ బౌలర్లు అతడిపై ప్రత్యేక ద‌ృష్టి సారించి వెంటనే ఔట్ చేస్తున్నారు.

మొదటి టీ ట్వంటీ తర్వాత జోఫ్రా ఆర్చర్ మీడియాతో మాట్లాడుతూ… జట్టు ప్రణాళిక కరెక్ట్‌గా అమలవడంతో విజయం దక్కిందని చెప్పాడు. రషీద్‌ ప్రపంచ శ్రేణి బౌలర్‌. ఎక్కడైనా బౌలింగ్‌ చేయగల సమర్థుడని కొనియాడాడు. ప్రత్యర్థులు బలంగా ఉంటే నాలోని అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుంది. నాకు ఒక వికెట్‌ దక్కినా.. మూడు వికెట్లు దక్కినా నా బౌలింగ్‌లో ఏమాత్రం మార్పు ఉండదని ఆర్చర్‌ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ఆర్చర్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి 23/3 ప్రదర్శన చేశాడు. అందులో కీలకమైన కేఎల్‌ రాహుల్‌(1), హార్దిక్‌ పాండ్య(19), శార్ధూల్‌ ఠాకుర్‌(0) వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. కాగా ఆదివారం రెండో టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది.

కాసేపట్లో ఏపీ మున్సిపల్‌ ఎన్నికల లెక్కింపు.. 10 గంటల కల్లా తొలి ఫలితం వెలువడే అవకాశం

కాసేపట్లో పోలింగ్‌ ప్రారంభం.. న్యూస్‌ పేపర్‌ సైజులో భారీ బ్యాలెట్‌.. ఓటు ఎలా వేయాలంటే..

Today Gold Price : స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి..