
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ జితేష్ శర్మ చేసిన ఒక అద్భుతమైన రనౌట్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని గుర్తుచేసేలా జితేష్ చేసిన మెరుపు ఫీల్డింగ్ కారణంగా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తన సెంచరీని పూర్తి చేసుకోలేకపోయాడు.
ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 46 బంతుల్లోనే 90 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో 16వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డికాక్ బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. బంతి బ్యాట్ అంచుకు తాకి కీపర్ వైపు వెళ్లింది. ఆ సమయంలో డికాక్ తెలియకుండానే క్రీజు బయటకు వచ్చాడు.
Sharp work behind the stumps from Jitesh Sharma! 😎
Huge wicket for #TeamIndia 🙌
Updates ▶️ https://t.co/japA2CHQpQ#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/G7WNqvqD0g
— BCCI (@BCCI) December 11, 2025
వెంటనే అప్రమత్తమైన జితేష్ శర్మ, బంతిని అందుకున్న మరుక్షణం మెరుపు వేగంతో వికెట్లను గిరాటేశాడు. క్రీజులోకి డికాక్ బ్యాట్ పెట్టకముందే బెయిల్స్ పడిపోవడంతో అంపైర్ అవుట్ ప్రకటించాడు. జితేష్ చూపించిన ఈ సమయస్ఫూర్తి అచ్చం ధోనిని తలపించిందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
మ్యాచ్ ఫలితం..
డికాక్ 90 పరుగుల వద్ద అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడి 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.