Video: రూల్స్ బ్రేక్ చేసిన జెమీమా.. పాక్ ప్లేయర్‌కు హగ్‌తోపాటు షేక్‌హ్యాండ్..!

India Pakistan No Handshake Policy: క్రీడలు దేశాల మధ్య అనుబంధాన్ని పెంచాలనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇటువంటి ఘటనలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలో భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్, పాక్ కెప్టెన్ ఫాతిమా సనను ఆప్యాయంగా కౌగిలించుకోవడం ఇప్పుడు నెట్ ఇంట్లో పెద్ద తుఫాన్‌నే సృష్టించింది.

Video: రూల్స్ బ్రేక్ చేసిన జెమీమా.. పాక్ ప్లేయర్‌కు హగ్‌తోపాటు షేక్‌హ్యాండ్..!
Fatima Sana And Jemimah Rodrigues

Updated on: Aug 01, 2026 | 7:00 AM

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ల్లో క్రికెటర్లు షేక్‌హ్యాండ్‌లు ఇవ్వకూడదనే అప్రకటిత నియమాన్ని పాటిస్తూ వస్తున్నారు. అయితే, ది హండ్రెడ్ లీగ్‌లో భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్, పాక్ కెప్టెన్ ఫాతిమా సనను ఆప్యాయంగా కౌగిలించుకోవడం ఇప్పుడు నెట్ ఇంట్లో పెద్ద తుఫాన్‌నే సృష్టించింది.

మైదానంలో ఆప్యాయత.. సోషల్ మీడియాలో రగడ!

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్ 2026’ లీగ్‌లో సూర్తాంప్టన్ వేదికగా సదరన్ బ్రేవ్స్, బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసింది. మ్యాచ్ అనంతరం జెమీమా రోడ్రిగ్స్, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఒకరికొకరు కరచాలనం చేసుకోవడమే కాకుండా ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కాగా, దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సైనికుల త్యాగాలను మర్చిపోయి ఇలా ప్రవర్తించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే, క్రీడలను రాజకీయం చేయకూడదని మరికొందరు సమర్థిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రోటోకాల్ పక్కనబెట్టిన జెమీమా!

2025 ఏప్రిల్‌లో జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ ఘటనకు నిరసనగా, భారత రక్షణ దళాలకు మద్దతుగా ఆసియా కప్ 2025లో నాటి భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాకు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. ఆ తర్వాత మహిళల టీ20 ప్రపంచకప్‌లోనూ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా పాక్ కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయలేదు. అయితే, బీసీసీఐ పరిధిలోకి రాని విదేశీ ఫ్రాంచైజ్ లీగ్ కావడంతో జెమీమా ఈ నిబంధనను పక్కనబెట్టినట్లు కనిపిస్తోంది.

క్రీడల్లో రాజకీయాలు వద్దు వర్సెస్ జాతీయ భావం!

ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ ముగిశాక షేక్‌హ్యాండ్ ఇవ్వడం తప్పనిసరి కాదు. అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టు ఈ సాంప్రదాయానికి దూరంగా ఉంటున్నప్పటికీ, లీగ్ మ్యాచ్‌లో జెమీమా చేసిన పనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “ఇది బీసీసీఐ ఈవెంట్ కాదు, క్రీడల్లో ద్వేషాన్ని చొప్పించకండి” అని ఒక వర్గం కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం “దేశం కంటే ఏ లీగ్ ఎక్కువ కాదు” అంటూ జెమీమా ప్రవర్తనను తప్పుబడుతున్నారు.

క్రీడలు దేశాల మధ్య అనుబంధాన్ని పెంచాలనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇటువంటి ఘటనలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. ఐసీసీ నియమాలను అతిక్రమించకపోయినా, భారత్ పట్ల ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను గౌరవించడం ప్రతి క్రీడాకారుడి బాధ్యత అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us