IND vs PAK: ‘మాతో ఆడకుంటే నరకానికే, వరల్డ్ కప్‌తో మాకు నష్టం లేదు’.. భారత్‌పై పాకిస్థాన్ మాజీ బ్యాటర్..

IND vs PAK: పాకిస్థాన్‌కి టీమిండియాను పంపేందుకు బీసీసీఐ అంగీకరించే వరకు.. ఈ ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ కోసం భారత్‌కి పాక్ ఆటగాళ్లు వెళ్లకూడదని ఆ దేశ మాజీ దిగ్గజ బ్యాటర్ జావేద్ మియాందాద్ అన్నాడు. ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం..

IND vs PAK: ‘మాతో ఆడకుంటే నరకానికే, వరల్డ్ కప్‌తో మాకు నష్టం లేదు’.. భారత్‌పై పాకిస్థాన్ మాజీ బ్యాటర్..
India Vs Pakistan

Updated on: Jun 19, 2023 | 10:05 PM

IND vs PAK: పాకిస్థాన్‌కి టీమిండియాను పంపేందుకు బీసీసీఐ అంగీకరించే వరకు.. ఈ ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ కోసం భారత్‌కి పాక్ ఆటగాళ్లు వెళ్లకూడదని ఆ దేశ మాజీ దిగ్గజ బ్యాటర్ జావేద్ మియాందాద్ అన్నాడు. ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న పాక్, భారత్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఇదిలా ఉండగా త్వరలో జరగబోయే ఆసియా కప్ కోసం టీమిండియా ప్లేయర్లు పాక్‌కి వెళ్లకుండా శ్రీలంక వేదికగా మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత్‌ రాకపోతే పాక్ నిర్ణయం తీసుకునేందుకు సమయం ఆసన్నమైందని.. 2012, 2016లో భారత్‌కి పాకిస్థాన్‌ వచ్చిందని, ఇప్పుడు టీమిండియా వంతు. ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌కి భారత్ ప్లేయర్లు రాకపోతే నరకానికి పోతారు’ అని మియాందాద్ అన్నారు.

‘నా నిర్ణయం అయితే ఏ ఒక్క మ్యాచ్ ఆడడానికి కూడా నేను భారత్‌కి వెళ్లను, అది ప్రపంచ కప్ అయినా సరే కూడా. మేము టీమిండియాతో ఆడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము, కానీ వారు ఎప్పుడూ అదే రీతిలో స్పందించలేదు. పాకిస్థాన్ క్రికెట్ పెద్దది.. మేము ఇప్పటికీ నాణ్యమైన క్రికెటర్లను తయారు చేస్తున్నాం. కాబట్టి మనం భారత్‌కి వెళ్లక పోతే మనకు నష్టం కలుగుతుందని నేను అనుకోను. క్రీడలను రాజకీయాలతో కలపకూడదు. క్రికెట్ అనేది ప్రజలను దగ్గర చేసే ఒక ఆట’ అని మియాందాద్ పేర్కొన్నారు.

కాగా, భారత్ చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించింది. అయితే టోర్నీ ముగిసి 6 నెలలకు కూడా కాకముందే ముంబైలో 26/11 దాడులు జరిగాయి. ఇక అప్పటినుంచి ఇరు దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు కూడా ఆగిపోయాయి. ఇక ఈ రెండు జట్లు ఇతర దేశాలలో జరిగే ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..