Pakistan New Coach: హెడ్ కోచ్‌గా కిర్‌స్టెన్ ఔట్.. ఆ వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్న పీసీబీ..

|

Oct 28, 2024 | 7:07 PM

పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిని పీసీబీ కూడా ఆమోదించింది. ఈ క్రమంలో పాకిస్థాన్ బోర్డు వన్డే, టీ20ఐ ఫార్మాట్లకు కొత్త ప్రధాన కోచ్‌ని కూడా ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు.

Pakistan New Coach: హెడ్ కోచ్‌గా కిర్‌స్టెన్ ఔట్.. ఆ వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్న పీసీబీ..
Pakistan New Coach
Follow us on

Pakistan New Coach: ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకోవడం ద్వారా పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు ఈ విజయం సాధించిన వెంటనే, PCB షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత దీనిపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. వాస్తవానికి, పాకిస్తాన్ క్రికెట్ జట్టు ODI – T20 ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టన్ అకస్మాత్తుగా రాజీనామా చేశాడు. PCB వెంటనే అతని రాజీనామాను ఆమోదించింది. మరుసటి క్షణంలో కొత్త ప్రధాన కోచ్‌ను ప్రకటించడం పెద్ద విషయం. కిర్‌స్టన్ స్థానంలో జాసన్ గిల్లెస్పీకి పాకిస్థాన్ వన్డే, టీ20 జట్టు ప్రధాన కోచింగ్‌ను అప్పగించింది.

జాసన్ గిల్లెస్పీకి కీలక బాధ్యత..

జాసన్ గిల్లెస్పీ ప్రస్తుతం పాకిస్థాన్ టెస్టు జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కిర్‌స్టన్ రాజీనామా చేసిన వెంటనే ఆయనకు వన్డే, టీ20 జట్టు బాధ్యతలు కూడా అప్పగించింది పీసీబీ. అయితే, ఈ బాధ్యత పేరుకు మాత్రమే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ జింబాబ్వే, ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత, అతని స్థానంలో మరొకరు ఈ పదవిని తీసుకోనున్నారంట. పాకిస్తాన్ జింబాబ్వే, ఆస్ట్రేలియాతో ODI, T20 సిరీస్‌లను ఆడవలసి ఉంది. పాకిస్తాన్‌కు ఇంత త్వరగా కొత్త ODI, T20 ప్రధాన కోచ్ లభించడు. అందుకే PCB ఈ బాధ్యతను గిల్లెస్పీకి అప్పగించింది.

గ్యారీ కిర్‌స్టన్ తన పదవిని వదలేందుకు ఇష్టపడలేదు..

పాక్ మీడియా కథనాల ప్రకారం, గ్యారీ కిర్‌స్టన్ కోచ్ పదవిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అతను జింబాబ్వే, ఆస్ట్రేలియాతో సిరీస్‌ల కోసం పూర్తి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ, PCB అకస్మాత్తుగా అతనికి చాలా కోపం తెప్పించింది. పాకిస్థాన్ కోచ్ నుంచి ఆటగాళ్లను ఎంపిక చేసే హక్కును పీసీబీ తొలగించింది. దీనితో కిర్‌స్టెన్ అసంతృప్తి చెందాడు. పీసీబీ తన పదవిని విడిచిపెట్టాల్సిన వాతావరణాన్ని సృష్టించింది.

అయితే, పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయంతో జాసన్ గిల్లెస్పీ కూడా నిరాశ చెందాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా విలేకరుల సమావేశంలో, ఏ ఆటగాడినీ ఎంపిక చేసే హక్కు తనకు లేదని, అందుకే ఆటగాళ్ల ఎంపిక విషయంలో తాను ఏమీ చెప్పలేనని చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..