
క్రికెట్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీయడం చాలా అరుదు. వన్డేల్లో, టీ20ల్లో ఈ ఘనత మనం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. కానీ టెస్టుల్లో మాత్రం దాదాపుగా అసాధ్యమే. అయితే, టీమిండియా మాజీ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టెస్ట్ మ్యాచ్ చరిత్రలో ఓ అరుదైన రికార్డుతో చెరగని ముద్ర వేశాడు. 2006లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. కరాచీలో జరిగిన ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడిన ఇర్ఫాన్ పఠాన్.. తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను కకావికలం చేశాడు.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
మొదటి ఓవర్ నాలుగో బంతికి సల్మాన్ బట్‌ను అద్భుతమైన అవుట్ స్వింగర్‌తో పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యూనిస్ ఖాన్‌కు ఓ బ్రిలియంట్ ఇన్ స్వింగర్ వేసి ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. అంతటితో ఆగకుండా, తర్వాతి బంతికి మరో ఇన్ స్వింగర్‌తో మహమ్మద్ యూసఫ్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఇర్ఫాన్ పఠాన్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్ మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. అతడి స్వింగ్ దెబ్బకు ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇది భారత క్రికెట్ చరిత్రలో ఒక సంచలన రికార్డు అని చెప్పొచ్చు.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
That’s the over. What an amazing bowling. pic.twitter.com/iagklXBi9x
— Kifayat Ali (@KiffayatAli) January 29, 2021
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..