
క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. ఒక యువ ఆటగాడు బౌలింగ్ చేస్తూ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో ప్రాణాలొదిలాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్ హ్యూస్ మైదానంలోనే చనిపోయాడు. అలాగే భారతదేశానికి చెందిన రామన్ లాంబా కూడా ఇదే రీతిలో కన్నుమూశారు. ఈ దురదృష్టకర ఘటనలను క్రికెట్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. తాజాగా అలాంటిదే మరొక విషాద ఘటన చోటుచేసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 20 ఏళ్ల బౌలర్ హైబ్ యాసిన్ మైదాపంలోనే కుప్పకూలాడు. బౌలింగ్ చేస్తూ గుండెపోటు రావడంతో అక్కడికక్కడే తుది శ్వాస విడిచాడు. దీంతో ఆ యువ ఆటగాడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తోటి సహచరులు, స్నేహితులు ఆ ఆటగాడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. యువ క్రికెటర్ మృతి పట్ల సోషల్ మీడియాలో కూడా సంతాపం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం బారాముల్లాలోని పట్టన్‌లోని హంజీవారాలో జరిగిన మ్యాచ్‌లో సుహైబ్ యాసిన్ మరణించాడు. బౌలింగ్ కోసం పరిగెత్తుతుండగా సుహైబ్ మైదానంలో కుప్పకూలిపోయాడు.
సుహైబ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆట నిలిచిపోయింది. క్రీడాకారులు, హాజరైన వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. క్షణం ఆలస్యం చేయకుండా సుహైబ్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. సుహైబ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, యువ బౌలర్ గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం నోయిడాలో కూడా క్రికెట్ ఆడుతూ పిచ్‌పై ఒకరు చనిపోయారు. ఇప్పుడు ఈ మొత్తం కేసును పోలీసులు విచారిస్తున్నారు.
In the wake of tragedy, Pattan grieves the loss of Suhaib Yaseen, a spirited soul who met an untimely end on the cricket field today. The pain is shared by the entire people of Pattan. My thoughts are with Suhaib’s family as they navigate this profound sorrow. May we collectively…
— Imran Reza Ansari (@imranrezaansari) January 26, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..