ఆస్పత్రిలో చేరిన కీలక ఆటగాళ్లు.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స.. మూడో టీ-20 కి అనుమానమే

ధర్మశాల(Dharmashala) వేదికగా భారత్‌ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో టీ20 లో రెండు జట్ల ఆటగాళ్లు గాయపడ్డారు. శనివారం జరిగిన రెండో టీ20లో ఇరు జట్ల ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan), దినేశ్‌ చండీమాల్‌..

ఆస్పత్రిలో చేరిన కీలక ఆటగాళ్లు.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స.. మూడో టీ-20 కి అనుమానమే
Ishan Kishan

Updated on: Feb 27, 2022 | 12:43 PM

ధర్మశాల(Dharmashala) వేదికగా భారత్‌ – శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో టీ20 లో రెండు జట్ల ఆటగాళ్లు గాయపడ్డారు. శనివారం జరిగిన రెండో టీ20లో ఇరు జట్ల ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan), దినేశ్‌ చండీమాల్‌(Dinesh Chandimal) గాయపడ్డారు. దీంతో వీరికి చికిత్స అందించేందుకు కాంగ్రాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మొదటి ఇన్నింగ్స్ లో ఇషాన్‌ తలకు గాయం కాగా, రెండో ఇన్నింగ్స్‌లో చండీమాల్‌ ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో చేతి బొటన వేలికి గాయమైంది. ఈ క్రమంలో వీరిద్దరినీ ఒకే ఆస్పత్రికి తరలించారు. ఇషాన్ కిషన్ కు సీటీ స్కాన్‌ చేసి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దినేశ్ కు అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్(Team India) ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) అజేయంగా 74 (44 బంతుల్లో), రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అజేయంగా 45 (18 బంతుల్లో) పరుగులు చేశారు. సంజూ శాంసన్ 39 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం. సొంతగడ్డపై ఈ ఫార్మాట్‌లో భారత్‌ వరుసగా ఏడో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా మూడో టీ20 నేడు(ఆదివారం) ధర్మశాలలో జరగనుంది.

Also Read

Viral Video: నా మామ కట్నంగా రైలు ఇచ్చారు.. నడపడం రాదని వద్దన్నాను..! అంటున్న ఈ వ్యక్తి.. వైరల్ వీడియో

Kodali Nani on Bheemla Nayak: భీమ్లానాయక్‌ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు… నాగార్జున అయినా పవన్ అయినా ఒకటే… (వీడియో)

Viral Video: ఇదేందిది నేనేడా చూడలే..! ఈ వ్యక్తి చిలిపి పనికి ఫ్యూజులు ఔవుట్‌..! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..