Border-Gavaskar trophy: ఆయనకు ఏజ్ బార్.. వేరొకరిని తీసుకుంటే మంచిది.. హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్

భారత క్రికెట్ జట్టులో అశ్విన్ ప్రస్తుతానికి కీలక బౌలర్‌గా ఉన్నప్పటికీ, హర్భజన్ సింగ్ వాషింగ్టన్ సుందర్‌ను భవిష్యత్తులో ప్రధాన ఆఫ్-బ్రేక్ బౌలర్‌గా తయారుచేయాలని భావిస్తున్నారు. భారత జట్టు తన ప్రస్తుత ఆటగాళ్లతో మరిన్ని విజయాలు సాధించేందుకు ఆశగా ఉన్నట్లు హర్భజన్ తెలిపారు.

Border-Gavaskar trophy: ఆయనకు ఏజ్ బార్.. వేరొకరిని తీసుకుంటే మంచిది.. హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్
Washington Sundar

Updated on: Dec 01, 2024 | 12:34 PM

38 ఏళ్ల వయసులో ఉన్న ఆర్ అశ్విన్‌ను ప్రస్థుతం టీమ్ ఇండియాలో భాగం చేసినప్పటికి.. భారత జట్టు మేనేజ్‌మెంట్ వాషింగ్టన్ సుందర్‌ను భవిష్యత్తులో మరింత ప్రభావవంతమైన బౌలర్‌గా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు హర్భజన్ సింగ్ అభిప్రాయపడుతున్నారు.  రవిచంద్రన్ అశ్విన్ 536 వికెట్లతో అనిల్ కుంబ్లే తర్వాత భారత దేశంలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, సమయం వస్తే వాషింగ్టన్ సుందర్‌ను జట్టు ప్రధాన ఆఫ్-బ్రేక్ బౌలర్‌గా మారుస్తారని హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. 38 సంవత్సరాల వయస్సులో ఉన్న అశ్విన్ కెరీర్‌లో అసాంతం బాగా ఆడాడు, కానీ ఇప్పుడు ఆయన ఒక దశలో ఉన్నాడు,” అని హర్భజన్ చెప్పారు. అందుకే టీమిండియా మెనేజ్ మెంట్ వాషింగ్టన్‌ను సిద్ధం చేయాలని అనుకుంటున్నారు. అది జట్టు దీర్ఘకాలిక ప్రణాళిక అని నేను భావిస్తున్నాను.” అని హర్భజన్ సింగ్ పేర్కొన్నారు.

హర్భజన్, 400 పైగా టెస్ట్ వికెట్లు, 700 పైగాఅంతర్జాతీయ వికెట్లతో, భారత జట్టుకు అద్భుతమైన సేవలు అందించారు. అతను 2008లో WACA టెస్ట్ మ్యాచ్‌ని గుర్తుచేస్తూ, ఆస్ట్రేలియాపై పెర్త్‌లో గెలిచిన విజయాన్ని ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది అని చెప్పాడు. పెర్త్ ఆస్ట్రేలియాకు ఎల్లప్పుడూ బలమైన మైదానం గా ఉంది, కానీ భారత జట్టు అక్కడ గెలిచినందుకు నిజంగా గొప్పగా అనిపించింది అని హర్భజన్ అన్నారు.

ఆస్ట్రేలియాలో భారత జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారత జట్టు ఇప్పుడు బాగా ఆడుతోంది, మొదటి టెస్టులో గెలిచినా, మరిన్ని గెలుపులు సాధిస్తే, WTC (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) ఫైనల్‌కు చేరడం ఖాయం. కానీ, అక్కడికి చేరుకోవడమే కాదు, గెలిచే దిశగా కృషి చేయడం ముఖ్యం అని అన్నారు.

భారత ఆటగాళ్లలో, జస్ప్రీత్ బుమ్రాను హర్భజన్ మరింత ప్రశంసించారు. “బుమ్రా అద్భుతమైన ఆటగాడు, అతనికి గొప్ప మనస్తత్వం ఉంది,” అని హర్భజన్ చెప్పారు. అంతేకాకుండా, హర్భజన్ కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తదితర ఆటగాళ్ల పట్ల కూడా సానుకూల వ్యాఖ్యలు చేశారు. “కేఎల్ రాహుల్ చాలా నాణ్యమైన ఆటగాడు, అతనికి ఆడటానికి సరైన అవకాశాలు ఇవ్వడం ముఖ్యమే,” అని “జైస్వాల్ కూడా చాలా మంచి ఆటగాడు” అని ఆయన చెప్పారు.

రాహుల్, సుబ్ మన్ గిల్, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్ల తిరిగి జట్టులో చేరడం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని హర్భజన్ అభిప్రాయపడ్డారు. “భారత జట్టు ఇప్పటి నుండి మరింత బలపడింది, ఇప్పుడు సిరీస్ గెలవాలని నేను ఆశిస్తున్నాను,” అని ఆయన చెప్పారు.