Road Safety World Series: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. మంగళవారం ఇంగ్లాండ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ లెజెండ్స్ టీం.. 20 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇక 189 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా లెజెండ్స్ 119 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే, ఇర్ఫాన్ పఠాన్ (61), మన్‌ప్రీత్ గోని (35) లు చివర్లో మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ కలిసి 26 బంతుల్లో 63 పరుగులు చేశారు. అయితే ఆఖరి ఓవర్‌లో ఇంగ్లాండ్ లెజెండ్స్ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు సంధించడంతో ఇండియా లెజెండ్స్ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ లెజెండ్స్ టీంలో.. కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (75), మాంటీ పనేసర్ (మూడు వికెట్లు) ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా లెజెండ్స్ జట్టు పేలవ ఆరంభంతో ప్రారంభించింది. వీరేందర్ సెహ్వాగ్ (6), మహ్మద్ కైఫ్ (1), సచిన్ టెండూల్కర్ (9) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత యువరాజ్(22) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. పనేసర్ అతడ్ని కూడా పెవిలియన్ చేర్చాడు. కానీ చివర్లో గోనీ- ఇర్ఫాన్ పఠాన్ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ క్రమంలోనే ఇర్ఫాన్ పఠాన్ 30 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే గోనీ కూడా అతడికి చక్కటి సహకారాన్ని అందించాడు. చివర్లో వీరిద్దరూ ఏడు సిక్సర్లు బాదారు. అయితే ఆఖరి ఓవర్‌లో ఇంగ్లాండ్ లెజెండ్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. ఇండియా లెజెండ్స్ ఆరు పరుగుల తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది.
మరిన్ని ఇక్కడ చదవండి:
కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!
కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!