Rohit Sharma: ముంబై ఇండియన్స్‌తో 12 ఏళ్ల సక్సెస్‌ఫుల్ జర్నీ.. 5 ట్రోఫీలు, అత్యధిక విజయాలతో సత్తా చాటిన హిట్‌మ్యాన్.. ఏమన్నాడంటే?

|

Jan 08, 2023 | 8:35 PM

రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌తో 5 సార్లు ఈ లీగ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. నేటితో తన ఫ్రాంచైజీతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌తో 12 ఏళ్ల సక్సెస్‌ఫుల్ జర్నీ.. 5 ట్రోఫీలు, అత్యధిక విజయాలతో సత్తా చాటిన హిట్‌మ్యాన్.. ఏమన్నాడంటే?
Rohit Sharma Mumbai Indians
Follow us on

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌తో 12 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈమేరకు సోషల్ మీడియాలో తన ఆలోచనలను పంచుకుంటూ, ఈ ప్రయాణం తనకు చాలా ఉత్తేజకరమైనది, ఉద్వేగభరితమైనదని చెప్పుకొచ్చాడు. డెక్కన్ ఛార్జర్స్‌లో తన మొదటి IPLని ఆడిన తర్వాత, 8 జనవరి 2011న బెంగళూరు, ముంబైలో, పంజాబ్ కింగ్స్ మెగా వేలంలో రోహిత్ కోసం ఎక్కువ వేలం వేసినా.. ముంబై దక్కించుకుంది. ఇక అప్పటి నుంచి రోహిత్‌ తమ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌. రోహిత్ ఐదు ఐపీఎల్ టైటిళ్లను (2013, 2015, 2017, 2019, 2020) ముంబైకి కెప్టెన్‌గా అందించాడు.

రోహిత్ శర్మ మాట్లాడుతూ, “ముంబై ఇండియన్స్‌లో ఇది 12 సంవత్సరాలు అని నేను నమ్మలేకపోతున్నాను. ఇది నాకు చాలా ఉత్తేజకరమైన, భావోద్వేగ ప్రయాణం. అనుభవజ్ఞులు, యువకులతో కలిసి మేం చాలా సాధించాం” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఫ్రాంచైజీ అధికారిక ప్రకటనలో రోహిత్ మాట్లాడుతూ, “ముంబయి ఇండియన్స్ నా కుటుంబం, నా తోటి ఆటగాళ్లు, అభిమానులు, మేనేజ్‌మెంట్ అందరి ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పల్టన్ కోసం మరిన్ని జ్ఞాపకాలను సృష్టించడానికి ఎదురుచూస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.

2015 ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 26 బంతుల్లో ఫిఫ్టీ సాధించినందుకు రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. అతను 4982 పరుగులతో ఎంఐ అత్యధిక స్కోరర్‌గానూ నిలిచాడు.

రోహిత్ శర్మ ఇన్‌స్టా పోస్ట్..

అతను ముంబై తరపున అత్యధికంగా క్యాప్ చేసిన ఆటగాడిగా, కెప్టెన్‌గా IPLలో అత్యధిక విజయాలు (143 మ్యాచ్‌లలో 81) సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. కానీ 2021లో ప్లేఆఫ్‌లను కోల్పోయిన తర్వాత, IPL 2022లో ముంబై నిరాశాజనకంగా చివరి స్థానంలో నిలిచింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో నాలుగు మాత్రమే గెలిచింది.

అంతర్జాతీయంగా, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 2023లో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ జనవరి 10న గౌహతిలో జరగనుంది. దీని తర్వాత జనవరి 12, 15 తేదీల్లో కోల్‌కతా, తిరువనంతపురంలో మ్యాచ్‌లు జరుగుతాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..