IPL Records: ఐపీఎల్‌లో అత్యధికంగా 200 పరుగులు చేసిన జట్లు ఇవే.. లిస్టులో టాప్ టీం ఏదో తెలుసా?

IPL Records: ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ IPL ఏప్రిల్ 2008లో ప్రారంభమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ కొనసాగుతుండగా, ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌లు ఇప్పటికే జరిగాయి. ఇకముందు కూడా జరగబోతున్నాయి. అభిమానులు ఎప్పుడూ ఎక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లను చూడాలని కోరుకుంటుంటారు. T20 ఫార్మాట్ బ్యాట్స్‌మెన్‌ల ఆధిపత్యాన్ని చూసింది. దీంతో 200 పరుగులను కూడా విన్నింగ్ స్కోర్ అని జట్లు నమ్మలేకపోతున్నాయి.

IPL Records: ఐపీఎల్‌లో అత్యధికంగా 200 పరుగులు చేసిన జట్లు ఇవే.. లిస్టులో టాప్ టీం ఏదో తెలుసా?
Csk

Updated on: May 10, 2024 | 1:45 PM

IPL Records: ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ IPL ఏప్రిల్ 2008లో ప్రారంభమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ కొనసాగుతుండగా, ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌లు ఇప్పటికే జరిగాయి. ఇకముందు కూడా జరగబోతున్నాయి. అభిమానులు ఎప్పుడూ ఎక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లను చూడాలని కోరుకుంటుంటారు. T20 ఫార్మాట్ బ్యాట్స్‌మెన్‌ల ఆధిపత్యాన్ని చూసింది. దీంతో 200 పరుగులను కూడా విన్నింగ్ స్కోర్ అని జట్లు నమ్మలేకపోతున్నాయి.

IPL చరిత్రలో మొట్టమొదటి మ్యాచ్‌లో, కోల్‌కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్‌పై 222-3 పరుగులు చేసింది. ఇందులో బ్రెండన్ మెకల్లమ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది. ఆ జట్టు 2024లో బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 287-3 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 277-3, ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 272-7 పరుగులు చేసింది. ఇప్పటి వరకు, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 మార్కును దాటింది. అయితే, ప్రతి సీజన్‌లో ఆడే జట్లలో, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్‌లో అతి తక్కువ సార్లు 200 మార్క్‌ను దాటింది.

ఇవి కూడా చదవండి

CSKతో పాటు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 లేదా అంతకంటే ఎక్కువగా 200 మార్క్‌ను దాటాయి. గుజరాత్ టైటాన్స్ 7 సార్లు, లక్నో సూపర్ జెయింట్ 6 సార్లు ఈ ఘనత సాధించాయి.

ఐపీఎల్‌లో ఏ జట్లు ఎన్నిసార్లు 200 పరుగులు చేశాయో ఇప్పుడు చూద్దాం..

1) చెన్నై సూపర్ కింగ్స్ (32 సార్లు) – అత్యధిక స్కోరు: 246/5

2) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (29 సార్లు) – అత్యధిక స్కోరు: 263/5

3) ముంబై ఇండియన్స్ (25 సార్లు) – అత్యధిక స్కోరు: 247/9

4) కోల్‌కతా నైట్ రైడర్స్ (25 సార్లు) – అత్యధిక స్కోరు: 272/7

5) పంజాబ్ కింగ్స్ (23 సార్లు) – అత్యధిక స్కోరు: 262/2

6) రాజస్థాన్ రాయల్స్ (21 సార్లు) – అత్యధిక స్కోరు: 226/6

7) సన్‌రైజర్స్ హైదరాబాద్ (20 సార్లు) – అత్యధిక స్కోరు: 287/3

8) ఢిల్లీ క్యాపిటల్స్ (15 సార్లు) – అత్యధిక స్కోరు: 257/4

9) గుజరాత్ టైటాన్స్ (7 సార్లు) – అత్యధిక స్కోరు: 233/3

10) లక్నో సూపర్ జెయింట్స్ (6 సార్లు) – అత్యధిక స్కోరు: 257/5

గమనిక: ఈ జాబితాలో డెక్కన్ ఛార్జర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, పూణే వారియర్స్ ఇండియా, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ గణాంకాలు లేవు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..