IPL 2025 Points Table: హైదరాబాద్‌పై కీలక విజయం.. కట్‌చేస్తే.. ముంబైకు ఊహించని షాక్?

IPL 2025 Points Table Update After MI vs SRH Match: ఐపీఎల్ 33వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. కానీ, పాయింట్ల పట్టికలో ఎటువంటి మార్పు రాలేదు.

IPL 2025 Points Table: హైదరాబాద్‌పై కీలక విజయం.. కట్‌చేస్తే.. ముంబైకు ఊహించని షాక్?
Ipl 2025 Points Table Mi Vs Srh Match

Updated on: Apr 18, 2025 | 6:54 AM

IPL 2025 Points Table Update After MI vs SRH Match: ఐపీఎల్ 2025లో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రతి జట్టు పాయింట్ల పట్టికలో తమ ఖాతా ఓపెన్ చేసింది. అలాగే, ప్రతి జట్టు కనీసం ఒక ఓటమిని చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో ప్లే ఆఫ్స్ చేరే జట్లపై ఉత్కంఠ నెలకొంది. టాప్-4లో నిలిచేందుకు అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే ముంబై ఇండియన్స్ స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. ఏడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించడం ద్వారా ముంబై తన ఖాతాలో మరో 2 పాయింట్లు చేర్చుకుంది. అయినప్పటికీ జట్టు స్థానంలో ఎటువంటి మార్పు లేదు.

ముంబై ఇండియన్స్‌కు మూడో విజయం..

ఏప్రిల్ 17న గురువారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ హైదరాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. కానీ, స్లో పిచ్‌పై హైదరాబాద్ డేంజరస్ ఓపెనర్లు ఊహించిన విధంగా బ్యాటింగ్ చేయలేకపోయారు. దీంతో హైదరాబాద్ జట్టు 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేజింగ్‌తో ముంబై బ్యాటర్ల తమ తుఫాన్ ఇన్నింగ్స్‌తో కేవలం 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. దీంతో, ముంబై 7 మ్యాచ్‌ల్లో మూడో విజయం సాధించింది. అదే సంఖ్యలో మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కు ఇది ఐదవ ఓటమి.

పాయింట్ల పట్టిక పరిస్థితి ఏమిటి?

ఐపీఎల్ 33వ మ్యాచ్ ఫలితం వచ్చినప్పటికీ, పాయింట్ల పట్టికలో ఎటువంటి మార్పు రాలేదు. ముంబై ఇండియన్స్ ఇప్పుడు 7 మ్యాచ్‌ల తర్వాత 6 పాయింట్లతో ఉంది. కానీ ముంజై జట్టు ఇంకా 7వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌ను అధిగమించలేకపోయింది. మరోవైపు, సన్‌రైజర్స్ 2 పాయింట్లు పొందే అవకాశాన్ని కోల్పోయింది. ఎస్‌ఆర్‌హెచ్ స్థానం మారలేదు. 7 మ్యాచ్‌లలో 4 పాయింట్లతో ఇప్పటికీ 9వ స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికీ చివరి స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ గరిష్టంగా 10 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

నంబర్ 1 అయ్యే ఛాన్స్ ఎవరికంటే?

ముంబై, సన్‌రైజర్స్ పరిస్థితిలో ఎటువంటి తేడా ఉండకపోవచ్చు. కానీ, ఏప్రిల్ 18 శుక్రవారం జరిగే మ్యాచ్‌తో పాయింట్ల పట్టికలో ఊహించని మార్పు చోటుచేసుకోవచ్చు. ఐపీఎల్ 34వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లు టాప్-4లో ఉన్నాయి. రెండింటికీ తలో 8 పాయింట్లు ఉన్నాయి. ఈ రెండు జట్లకు నంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. బెంగళూరు చాలా దగ్గరగా ఉంది. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్ గెలిస్తే 10 పాయింట్లతో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. బెంగళూరు నెట్ రన్ రేట్ (0.672) ఢిల్లీ క్యాపిటల్స్ (0.744) కి చాలా దగ్గరగా ఉంది. మరోవైపు, నాల్గవ స్థానంలో ఉన్న పంజాబ్ (0.172) గెలిస్తే పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే, అతను రన్ రేట్‌లో చాలా వెనుకబడి ఉంది. గెలిస్తే, పంజాబ్ జట్టు కనీసం రెండవ స్థానానికి చేరుకోగలదు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..