IPL 2021 Shedule: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ రీషెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఐపీఎల్-14 ఫేజ్2 తేదీలను వెల్లడించింది. ఐపీఎల్ 14వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి పునఃప్రారంభం కానుంది. ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్‌లో 29 మ్యాచ్‌లు పూర్తి అయిన సంగతి తెలిసిందే. మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. మెదటి మ్యాచ్ ఢిపిండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. పూర్తి షెడ్యూలును బీసీసీఐ విడుదల చేసింది. నూతన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10న మొదటి క్వాలిఫైయర్, అక్టోబర్ 11న ఎలిమినేటర్, అక్టోబర్ 13న రెండో క్వాలిఫైయర్, అక్టోబర్ 15న దుబాయి వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. యుఏఈలో జరగబోయే మ్యాచ్‌లలో 13 మ్యాచ్‌లు దుబాయ్‌లో, 10 షార్జాలో, ఎనిమిది మ్యాచ్‌లు అబుదాబిలో జరుగుతాయి. ఐపీఎల్ 2021 ఫైనల్ అక్టోబర్ 15 న జరుగుతుంది. ఫైనల్ దుబాయ్‌లో జరుగుతుంది. అక్టోబర్ 10 న, మొదటి క్వాలిఫైయర్ దుబాయ్‌లో, ఎలిమినేటర్‌తోపాటు రెండవ క్వాలిఫైయర్ అక్టోబర్ 11, 13వ తేదీల్లో షార్జాలో నిర్వహించనున్నారు. మేలో కరోనా కారణంగా టోర్నమెంట్ అర్థాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2021 లో రోజుకు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం, మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతాయ. రాత్రిపూట నిర్వహించే మ్యాచ్‌లు 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. టోర్నమెంట్ యొక్క చివరి లీగ్ మ్యాచ్ అక్టోబర్ 9 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. అక్టోబర్ 10 న దుబాయ్‌లో మొదటి క్వాలిఫైయర్, 11 న ఎలిమినేటర్, 13 న రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతాయి. ఈ రెండూ షార్జాలో నిర్వహించనున్నారు. ఐపీఎల్ 2021 ఫైనల్ అక్టోబర్ 15 న దుబాయ్‌లో జరుగుతుంది.
సెప్టెంబర్ 19 న టోర్నమెంట్ తిరిగి ప్రారంభమవుతోంది. కేకేఆర్‌తో ఆర్జీబీ సెప్టెంబర్ 20 న అబుదాబిలో తలపడనుంది. ఐపీఎల్ 2021 యొక్క రెండవ భాగంలో సెప్టెంబర్ 25 నుంచి రోజుకు రెండు మ్యాచులు ప్రారంభంకానున్నాయి. అబుదాబిలో మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్- పంజాబ్ కింగ్స్ షార్జాలో తలపడతాయి. అలాగే సెప్టెంబర్ 26 న చెన్నై సూపర్ కింగ్స్- కేకేఆర్ అబుదాబిలో.. ఆర్‌సీబీ- ముంబై దుబాయ్‌లో ఆడడనున్నాయి.
అన్ని జట్లు ఖచ్చితంగా మధ్యాహ్నం కనీసం ఒక మ్యాచ్లో తలపడనున్నాయి. ఢిల్లీ జట్టు మాత్రం మధ్యాహ్నం మూడు మ్యాచ్‌లు ఆడనుంది. అదే సమయంలో సీఎస్‌కే, ముంబై, కేకేఆర్, పంజాబ్‌లు మధ్యాహ్నం రెండు మ్యాచ్‌లు ఆడనున్నాయి. షార్జాలో అన్ని జట్లు రెండు మ్యాచ్‌లు ఆడనున్నాయి. సీఎస్‌కే, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హైదరాబాద్, ఆర్‌సీబీ దుబాయ్‌లో మూడు మ్యాచ్‌లు ఆడనుండగా, ముంబై, కేకేఆర్ మూడు మ్యాచ్‌లు అబుదాబిలో ఆడనున్నాయి.
Also Read:
Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో భవానీ దేవి శుభారంభం.. తొలిపోరులో ఘన విజయం