IPL Mega Auction 2025: ఆర్సీబీ కెప్టెన్ గా ఆ ముగ్గురిలో ఒకరు ఫిక్స్ అయినట్లేనా..?

|

Nov 25, 2024 | 12:46 PM

ఆ IPL 2025 వేలం మొదటి రోజు RCB కెప్టెన్సీ కోసం సరైన ఆటగాడిని దక్కించుకోలేకపోయింది. 2వ రోజు వారి ఎంపికగా ఫాఫ్ డుప్లెసిస్, సామ్ కర్రాన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. కాగా వీరిద్దరు కాకపోతే విరాట్ కోహ్లీ RCB కెప్టెన్ అయ్యే అవకాశముంది. ఇప్పుడు ఆర్సీబీ తమ కెప్టెన్ గా ఈ ముగ్గురిని పరిగణనలోకి తీసుకోనుంది.

IPL Mega Auction 2025: ఆర్సీబీ కెప్టెన్ గా ఆ ముగ్గురిలో ఒకరు ఫిక్స్ అయినట్లేనా..?
Sam Curran
Follow us on

IPL 2025 వేలం మొదటి రోజు ముగిసింది, ఎందుకంటే మొత్తం పది జట్లు తమకు కావలసిన ఆటగాళ్లను పొందడానికి తీవ్రంగా పోరాడాయి. కొన్ని కొనుగోళ్లు అర్ధవంతంగా ఉంటే, మరికొన్ని డబ్బు వృధా అని చాలామంది భావిస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు చురుకైన కొనుగోళ్లను చేశాయి, కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) వేలం మొదటిరోజు పూర్తిగా వెనకడుగు వేసింది. కెప్టెన్సీని బాధ్యతలను నిర్వర్తించే ఆటగాడిని దక్కించుకోవడం లో పూర్తిగా విఫలమయింది.

కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లేదా రిషబ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సమర్థులైన ఆటగాళ్లపై RCB కన్నేసినట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆర్సీబీ ఫ్రాంచైజీ ఎవరిని దక్కించుకోలేదు. ఇప్పుడు 2 వ రోజు కోసం కెప్టెన్సీ చేపట్టే సత్తా ఉన్న ఆటగాన్ని దక్కించుకోవాల్సి ఉంటుంది.

మొదటి రోజు వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు నాయకత్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆటగాళ్లే. వారందరు కూడా ఇతర జట్లకు విక్రయించబడ్డారు. ఇప్పుడు ఆ బాధ్యతను పూడ్చేందుకు వేరే మార్గం లేదు. కాబట్టి, 2వ రోజు వేలాన్ని దృష్టిలో ఉంచుకుని, RCBకి 3 కెప్టెన్సీ ఎంపికలు ఉన్నాయి.

ఫాఫ్ డుప్లెసిస్

2022లో RCBలో చేరిన ఫాఫ్, మంచి కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. మూడు సీజన్లలో RCBని రెండుసార్లు ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అతని నాయకత్వం స్ఫూర్తిదాయకంగా ఉండటంతో, గత మూడు సీజన్లలో ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. అంతేకాకుండా, అతను 2022 నుండి RCB తరఫున అత్యధిక స్కోరర్‌గా ఉన్నాడు. 40 సంవత్సరాల వయస్సులో కూడా ఇప్పటికీ చాలా మంది యువకుల కంటే ఫాఫ్‌ ఫిట్‌గా ఉన్నాడు. నమ్మకమైన కెప్టెన్సీ ప్లేయర్‌లు అందుబాటులో లేనందున, RTMని ఉపయోగించి ఫాఫ్‌ని తిరిగి పొందడానికి RCB ప్రయత్నించవచ్చు.

సామ్ కర్రాన్

RCB ఫస్ట్-ఛాయిస్ కెప్టెన్లు అందరూ ఇతర జట్లతో చేరినందున, వారు వేలంలో సామ్ కరణ్‌ను తక్కువ ధరకు దక్కించుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఈ ఇంగ్లీష్ ఆల్ రౌండర్ శిఖర్ ధావన్ గైర్హాజరీలో ముందుగా పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహించాడు. ఇప్పుడు RCB కెప్టెన్సీ ఛాయిస్ కు అతడు సరైన ఎంపిక అవవచ్చు. సామ్ కర్రాన్ మంచి ఆల్ రౌండర్, అంతేకాదు ఐపీఎల్‌లో చాలా అనుభవం ఉంది. కెప్టెన్సీ మరే ఆటగాడు దొరకని పక్షంలో బెంగళూరు జట్టు కరణ్‌ను పరిగణనలోకి తీసుకునే అవకాశముంది.

విరాట్ కోహ్లీ

కొన్ని నెలల క్రితం, కోహ్లి జట్టుకు అవసరమైతే, అతను జట్టు కెప్టెన్‌గా తిరిగి రావచ్చని అంతటా ప్రచారం జరిగింది. విరాట్ కోహ్లీ నే RCB కెప్టెన్సీ నియమించే అవకాశముందని ఆ మెనేజ్ మెంట్ లోని పలువురు క్లూ కూడా ఇచ్చారని ఉహాగానాలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు వేలంలో కెప్టెన్సీ స్థాయి గల ఆటగాడు దక్కకపోతే విరాట్ సేవలు జట్టుకు అందించే అవకాశముంది. కోహ్లి గతంలో 2013-2021 వరకు RCBకి నాయకత్వం వహించాడు. 2016లో జట్టును ఫైనల్‌ వరకు తీసుకెళ్లాడు. పైనున్న ఆటగాళ్లందరి కంటే విరాట్ మంచి ఎంపిక. బ్యాటింగ్‌పై దృష్టి సారించాలని భావించి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి మళ్లీ కెప్టెన్సీ ఆఫర్‌కు అంగీకరిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.