RR vs DC IPL Match Result: బట్లర్, జైస్వాల్ దెబ్బకు.. ఢిల్లీకి తప్పని మూడో ఓటమి..

|

Apr 08, 2023 | 7:36 PM

Rajasthan Royals vs Delhi Capitals: రాజస్థాన్ రాయల్స్ అందించిన 200 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ టీం రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

RR vs DC IPL Match Result: బట్లర్, జైస్వాల్ దెబ్బకు.. ఢిల్లీకి తప్పని మూడో ఓటమి..
Rr Vs Dc
Follow us on

RR vs DC IPL Match Result: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16 11వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్ అందించిన 200 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ టీం రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

మూడు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు ఇది రెండో విజయం. పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో ఉంది. గౌహతిలోని బరస్పరా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇవి కూడా చదవండి

వార్నర్ 57వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 6000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను 165 ఇన్నింగ్స్‌ల్లో ఈ స్థానాన్ని సాధించాడు. విరాట్ కోహ్లి (188 ఇన్నింగ్స్)ను వార్నర్ వదిలిపెట్టాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..