GT vs RCB IPL Match Result: ఐపీఎల్‌లో తొలిసారి ఎంట్రీ ఇచ్చి, వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరు ఇచ్చిన 170 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల నష్టానికి 19.3 ఓవర్లలో చేధించింది. గుజరాత్ బ్యాటర్లలో రాహుల్ తెవాతియా (43*) డేవిడ్ మిల్లర్ (39*), వృద్ధిమాన్ సాహా (29), శుభ్‌మన్ గిల్ (31), సాయి సుదర్శన్ (20) పరగులు సాధించారు. మొదట్లో వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లోకి కూరుకుపోయిన గుజరాత్‌ను రాహుల్, మిల్లర్ ఆదుకున్నారు. క్రమంగా స్కోర్ బోర్డ్‌ను పెంచుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో గుజరాత్ ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది.
ఇక అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. గడిచిన రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యి నిరాశ పరిచిన విరాట్ కోహ్లీ (58) పరుగులతో రాణించాడు. అయితే భారీ స్కోర్ చేసే అవకాశం ఉన్నా గుజరాత్ బౌలర్లు పుంజుకోవడంతో బెంగళూరు తక్కువ సమయంలోనే 4 వికెట్లు కోల్పోయింది దీంతో 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. డుప్లెసిస్ డకౌట్ కాగా.. షాహ్‌బాజ్ 2*, మహిపాల్ లామ్రోర్ 16 పరుగులు చేశారు.
మరిన్ని క్రికెట్ వార్తలకు క్లిక్ చేయండి..
Also Read: Genelia: ఫ్యాషన్ ఐకాన్‌గా మారిన హాసినీ.. స్టైలీష్ లుక్‌లో అదిరిపోయిన జెనిలీయా..
తెర చాటు నుండి కొంచెం కొంచెం గా అందాలను ఆరబోస్తున్న ముద్దుగుమ్మని గుర్తు పట్టండి..!