
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 కోసం మంగళవారం అబుదాబిలో మినీ వేలం జరిగింది. 156 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నారు. పది జట్లు 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి రూ. 215.45 కోట్లు ఖర్చు చేశాయి. వీరిలో 29 మంది విదేశీయులు, 48 మంది భారతీయులు ఉన్నారు. ఐపీఎల్ 2026 మార్చి 26న ప్రారంభమవుతుంది.
మినీ ఆక్షన్లో యువ ఓపెనర్ పృథ్వీ షా ను కొనుగోలు చేయడానికి మొదట ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. అయితే, మూడోసారి వేలానికి వచ్చినప్పుడు, అతనికి అదృష్టం కలిసొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.75లక్షల బేస్ ప్రైస్ కు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో ముంబై ఇండియన్స్ జట్టు తమ కొనుగోళ్లను విజయవంతంగా ముగించింది. ముంబై ఇండియన్స్ జట్టు తమకు కేటాయించిన 25 మంది ఆటగాళ్ల గరిష్ట పరిమితిని చేరుకోవడంతో వారి ఆక్షన్ ప్రక్రియ ముగిసింది.
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో భారతీయ లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ ధరకు కొనుగోలు చేసింది. చాహర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ.5.20 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించింది. గతంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన అనుభవం ఉన్న రాహుల్ చాహర్, CSK స్పిన్ అటాక్‌కు అదనపు బలాన్ని చేకూర్చగలడు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవీంద్ర జడేజాకు బ్యాకప్‌గా లేదా తోడుగా చాహర్ సేవలను CSK వినియోగించుకునే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఇద్దరు కీలక ఫాస్ట్ బౌలర్లను వారి బేస్ ప్రైస్‌లకే దక్కించుకున్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. హెన్రీని అతని బేస్ ప్రైస్ అయిన రూ.2 కోట్లకే CSK సొంతం చేసుకుంది. భారత దేశవాళీ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసింది. ఆకాష్ దీప్‌ను అతని బేస్ ప్రైస్ అయిన రూ.కోటికే KKR దక్కించుకుంది.
ఆక్షన్లో ఇంగ్లాండ్‌కు చెందిన పవర్ హిట్టర్, ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ కోసం మరోసారి వేలంపాట జరిగింది. ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్అ తనిని భారీ ధరకు కొనుగోలు చేసి తమ జట్టులోకి తీసుకుంది. వేలంలో మొదటి రౌండ్‌లో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో లివింగ్‌స్టోన్ ఉన్నప్పటికీ, చివరి రౌండ్‌లో SRH అతన్ని తమ జట్టులోకి తీసుకోవడానికి గట్టిగా నిర్ణయించుకుంది. రూ.13 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి, తమ మిడిల్ ఆర్డర్‌కు అవసరమైన విధ్వంసకర బ్యాటింగ్ శక్తిని, పార్ట్-టైమ్ స్పిన్ సామర్థ్యాన్ని జోడించుకుంది. ఈ కొనుగోలుతో SRH బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారింది.
ఆక్షన్లో యువ ఓపెనర్ పృథ్వీ షా, ఆల్‌రౌండర్ దీపక్ హుడా మరోసారి అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయారు.
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో భారత బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. సర్ఫరాజ్ ఖాన్‌ను అతని బేస్ ప్రైస్ అయిన రూ.75 లక్షలకే CSK సొంతం చేసుకుంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సర్ఫరాజ్‌ను, చెన్నై జట్టు తక్కువ ధరకే దక్కించుకోవడం విశేషం.
యాక్సిలరేషన్ రౌండ్ 1 ముగిసింది. ఈ రౌండ్‌లో 66 మంది ఆటగాళ్లను వేలం పూల్‌కు చేర్చారు. వీరిలో 23 మందిని కొనుగోలు చేయగా, 43 మంది అమ్ముడుపోలేదు.
ఈ రౌండ్ తర్వాత, ప్రతి ఫ్రాంచైజీ నుంచి ఐదు లేదా ఆరు పేర్లు తీసుకుంటారు. వారిని యాక్సిలరేషన్ రౌండ్ 2 కోసం పూల్‌లోకి తీసుకువస్తారు.
సెదికుల్లా అటల్ – రూ. 75 లక్షలు – అమ్ముడుపోలేదు
పాతుమ్ నిస్సాంక – రూ. 75 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్ కు రూ. 4 కోట్లు
రాహుల్ త్రిపాఠి – రూ. 75 లక్షలు – కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. 75 లక్షలు.
సీన్ అబాట్ – రూ. 2 కోట్లు – అమ్ముడుపోలేదు.
మైఖేల్ బ్రేస్‌వెల్ – రూ. 2 కోట్లు – అమ్ముడుపోలేదు.
బెన్ ద్వార్షుయిస్ – రూ. 1 కోటి – అమ్ముడుపోలేదు.
జాసన్ హోల్డర్ – రూ. 2 కోట్లు – గుజరాత్ టైటాన్స్ కు రూ. 7 కోట్లకు సోల్డ్.
డారిల్ మిచెల్ – రూ. 2 కోట్లు – అమ్ముడుపోలేదు.
దసున్ షనక – రూ. 75 లక్షలు – అమ్ముడుపోలేదు.
మాథ్యూ షార్ట్ – రూ. 1.50 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్ కు రూ. 1.50 కోట్లకు సోల్డ్.
టామ్ బాంటన్ – రూ. 2 కోట్లు – అమ్ముడుపోలేదు.
జోర్డాన్ కాక్స్ – రూ. 75 లక్షలు – అమ్ముడుపోలేదు.
జోష్ ఇంగ్లిస్ – రూ. 2 కోట్లు – అమ్ముడుపోలేదు.
టిమ్ సీఫెర్ట్ – రూ. 1.50 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. 1.50 కోట్లకు సోల్డ్.
కైల్ జామిసన్ – రూ. 2 కోట్లు – అమ్ముడుపోలేదు.
ఆడమ్ మిల్నే – రూ. 2 కోట్లు – అమ్ముడుపోలేదు.
లుంగీ న్గిడి – రూ. 2 కోట్లు – అమ్ముడుపోలేదు.
ముస్తాఫిజుర్ రెహమాన్ – రూ. 2 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. 9.20 కోట్లకు సోల్డ్.
చేతన్ సకారియా – రూ. 75 లక్షలు – అమ్ముడుపోలేదు.
కుల్దీప్ సేన్ – రూ. 75 లక్షలు – అమ్ముడుపోలేదు.
వకార్ సలాంఖైల్ – రూ. 1 కోటి – అమ్ముడుపోలేదు.
డానిష్ మాలేవర్ – రూ. 30 లక్షలు – ముంబై ఇండియన్స్ కు రూ. 30 లక్షలకు సోల్డ్.
సల్మాన్ నిజార్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
అక్షత్ రఘువంశీ – రూ. 30 లక్షలు – లక్నో సూపర్ జెయింట్స్ కు రూ. 2.20 కోట్లకు సోల్డ్.
సాత్విక్ దేస్వాల్ – రూ. 30 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ. 30 లక్షలు.
అమన్ ఖాన్ – రూ. 30 లక్షలు – చెన్నై సూపర్ కింగ్స్ కు రూ. 40 లక్షలకు సోల్డ్.
విక్కీ ఓస్ట్వాల్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
మయాంక్ రావత్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
మంగేష్ యాదవ్ – రూ. 30 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ. 5.20 కోట్లు.
సలీల్ అరోరా – రూ. 30 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. 1.50 కోట్లకు సోల్డ్.
రవి సింగ్ – రూ. 30 లక్షలు – రాజస్థాన్ రాయల్స్ కు రూ. 95 లక్షలకు సోల్డ్.
కె.ఎం. ఆసిఫ్ – రూ. 40 లక్షలు – అమ్ముడుపోలేదు.
సాకిబ్ హుస్సేన్ – రూ. 30 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. 30 లక్షలకు సోల్డ్.
మొహమ్మద్ ఇజార్ – రూ. 30 లక్షలు – ముంబై ఇండియన్స్ కు రూ. 30 లక్షలకు సోల్డ్.
ఓంకార్ తర్మలే – రూ. 40 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. 30 లక్షలకు సోల్డ్.
మురుగన్ అశ్విన్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
తేజస్ బరోకా – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
కె.సి. కరియప్ప – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
మోహిత్ రాథీ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
కూపర్ కొన్నోలీ – రూ. 2 కోట్లు – పంజాబ్ కింగ్స్ కు రూ. 3 కోట్లకు సోల్డ్
డాన్ లారెన్స్ – రూ. 2 కోట్లు – అమ్ముడుపోలేదు.
తస్కిన్ అహ్మద్ – రూ. 75 లక్షలు – అమ్ముడుపోలేదు.
రిచర్డ్ గ్లీసన్ – రూ. 75 లక్షలు – అమ్ముడుపోలేదు.
అల్జారి జోసెఫ్ – రూ. 2 కోట్లు – అమ్ముడుపోలేదు.
రిలే మెరెడిత్ – రూ. 1.50 కోట్లు – అమ్ముడుపోలేదు.
ఝే రిచర్డ్‌సన్ – రూ. 1.50 కోట్లు – అమ్ముడుపోలేదు.
ధీరజ్ కుమార్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
తనయ్ త్యాగరాజన్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
కానర్ ఎస్టర్‌హుజెన్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
ఇర్ఫాన్ ఉమైర్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
చింతల్ గాంధీ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
అమిత్ కుమార్ – రూ. 30 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. 30 లక్షలకు సోల్డ్.
విశాల్ నిషాద్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
నాథన్ స్మిత్ – రూ. 75 లక్షలు – అమ్ముడుపోలేదు.
డేనియల్ లాటెగాన్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
అథర్వ అంకోలేకర్ – రూ. 30 లక్షలు – ముంబై ఇండియన్స్‌కు రూ. 30 లక్షలు
కరణ్ లాల్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
ఉత్కర్ష్ సింగ్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
ఆయుష్ వర్తక్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
ప్రఫుల్ హింగే – రూ. 30 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. 30 లక్షలకు సోల్డ్.
జిక్కు బ్రైట్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
ఇజాజ్ సవారియా – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
క్రెయిన్స్ ఫులేట్రా – రూ. 30 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. 30 లక్షలకు సోల్డ్.
సార్థక్ రంజన్ – రూ. 30 లక్షలు – కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. రూ. 30 లక్షలు
దక్ష్ కమ్రా – రూ. 30 లక్షలు – కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. రూ. 30 లక్షలు
మణిశంకర్ మురాసింగ్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు.
అక్షత్ రఘువంశీని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2.20 కోట్లకు కొనుగోలు చేసింది. అతని బేస్ ధర రూ. 30 లక్షలు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా అక్సర్ కోసం బిడ్ వేసింది, కానీ తరువాత ఉపసంహరించుకుంది.
పంజాబ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ సలీల్ అరోరాను SRH రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేసింది. అతని బేస్ ధర రూ. 30 లక్షలు.
ఈ వేలంలో పంజాబ్ కింగ్స్ తమ తొలి కొనుగోలును చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన కూపర్ కొన్నోలీని ₹3 కోట్లకు సంతకం చేసింది. అతని ప్రాథమిక ధర ₹2 కోట్లు (₹2 కోట్లు).
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ లో బంగ్లాదేశ్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు భారీ ధరకు దక్కించుకుంది. ముస్తాఫిజుర్‌ను KKR జట్టు రూ.9.20 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ది ఫిజ్ అని పిలిచే రెహమాన్ డెత్ ఓవర్లలో తన కట్టర్ బంతులతో వికెట్లు తీయగల సామర్థ్యం KKR బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయనుంది.
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో న్యూజిలాండ్‌కు చెందిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫెర్ట్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసింది. సీఫెర్ట్‌ను KKR జట్టు రూ.1.50 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. టాప్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం ఉన్న సీఫెర్ట్, KKR జట్టుకు బ్యాకప్ వికెట్ కీపర్ ఆప్షన్‌గా ఉపయోగపడతాడు.
ఆస్ట్రేలియాకు చెందిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మ్యాథ్యూ షార్ట్ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. షార్ట్ కోసం రూ.1.50 కోట్ల బేస్ ప్రైస్‌తో CSK తొలి బిడ్‌ను నమోదు చేసింది. ఏ ఇతర ఫ్రాంచైజీ పోటీకి రాకపోవడంతో, మ్యాథ్యూ షార్ట్‌ను CSK రూ.1.50 కోట్లకే సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ ను గుజరాత్ టైటాన్స్జ ట్టు భారీ ధరకు కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన తీవ్ర పోటీలో, గుజరాత్ టైటాన్స్ జట్టు హోల్డర్‌ను రూ.7 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయగల హోల్డర్, GT జట్టుకు బౌలింగ్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో బలాన్ని చేకూర్చగలడు.
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో భారత బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠిని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసింది. త్రిపాఠిని అతని బేస్ ప్రైస్ అయిన రూ.75 లక్షలకే KKR సొంతం చేసుకుంది. మిడిల్ ఆర్డర్‌లో స్థిరంగా ఆడే రాహుల్ త్రిపాఠి, తక్కువ ధరకే దొరకడం KKR జట్టుకు పెద్ద లాభంగా చెప్పవచ్చు.
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో శ్రీలంక క్రికెటర్ పతుమ్ నిస్సంకను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. నిస్సంక కోసం వేలంపాటలో బిడ్ ధర రూ.4 కోట్ల వరకు పెరిగింది. చివరికి, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఈ లంక ఆటగాడిని రూ.4 కోట్లకు కొనుగోలు చేసి తమ జట్టులోకి తీసుకుంది. నిస్సంక ఒక స్థిరమైన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ కావడంతో, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లైనప్‌కు అతను మరింత బలాన్ని చేకూర్చగలడు.
మొత్తం 25 మంది ఆటగాళ్లను అమ్మేశారు. వారిలో 10 మంది విదేశీయులు ఉన్నారు.
10 ఫ్రాంచైజీలు ఇప్పటివరకు రూ.119.10 కోట్లు ఖర్చు చేశాయి.
ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతను ₹25.20 కోట్లకు అమ్ముడయ్యాడు.
10వ సెట్‌లో, రాజస్థాన్ రాయల్స్ యష్ రాజ్ పునియాపై విశ్వాసం వ్యక్తం చేసింది. అతని బేస్ ధర రూ. 30 లక్షలు.
విఘ్నేష్ పుత్తూరు కూడా 30 లక్షల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లాడు. ప్రశాంత్ సోలంకీని 30 లక్షల రూపాయలకు KKR కొనుగోలు చేసింది.
కర్ణ్ శర్మ, శివమ్ శుక్లా, కుమార్ కార్తికే సింగ్, వహిదుల్లా జద్రాన్ అమ్ముడుపోలేదు.
సుశాంత్ మిశ్రాను రాజస్థాన్ రాయల్స్ రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది.
నమన్ తివారీని లక్నో సూపర్ జెయింట్స్ రూ.1 కోటికి కొనుగోలు చేసింది.
అశోక్ శర్మను 90 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్.
ఎనిమిదో సెట్‌లో (వికెట్ కీపర్లు) కార్తీక్ శర్మ అతిపెద్ద పేరు. రుచిత్ అహిర్, వంశ్ బేడి వేలం ప్రారంభంలో 30 లక్షల రూపాయల బేస్ ధరకు అమ్ముడుపోలేదు. తుషార్ రహేజా కూడా కొనుగోలుదారుడిని కనుగొనలేకపోయాడు.
రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వచ్చిన కార్తీక్‌ను జట్లలో తీవ్రమైన బిడ్డింగ్ జరిగింది. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని రూ. 14.20 కోట్లకు కొనుగోలు చేసింది.
ముకుల్ చౌదరిని లక్నో సూపర్ జెయింట్స్ రూ.2.60 కోట్లకు కొనుగోలు చేయగా, తేజస్వి సింగ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది.
ఎట్టకేలకు కావ్యపాప శివం కుమార్‌పై కన్నేసింది. రూ. 30 లక్షల బేస్ ప్రైజ్‌కే సొంతం చేసుకుంది.
ఏడో సెట్ అన్‌క్యాప్డ్ ఆల్ రౌండర్ల కోసం. ఇందులో 10 మంది ఆటగాళ్ళు ఉన్నారు. వారిలో ముగ్గురు కొనుగోలు చేయగా, ఏడుగురు అమ్ముడుపోలేదు.
అకిబ్ నబీ దార్‌ను DC 8.40 కోట్లకు, ప్రశాంత్ వీర్‌ను CSK 14.20 కోట్లకు, శివాంగ్ కుమార్‌ను SRH 30 లక్షలకు కొనుగోలు చేసింది.
రాజవర్ధన్ హంగ్రేకర్ (40 లక్షలు), తనుష్ కోటియన్ (30 లక్షలు), మహిపాల్ లోమ్రోర్ (50 లక్షలు), కమలేష్ నాగర్‌కోటి (30 లక్షలు), విజయ్ శంకర్ (30 లక్షలు), సన్వీర్ సింగ్ (30 లక్షలు), ఐడెన్ టామ్ (30 లక్షలు) అమ్ముడుపోలేదు.
ఐపీఎల్ 2026 వేలంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అన్‌క్యాప్డ్ (జాతీయ జట్టుకు ఆడని) ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ (Prashant Veer) కోసం ఫ్రాంచైజీలు రికార్డు స్థాయి పోటీని ప్రదర్శించాయి. కేవలం రూ. 30 లక్షల కనీస ధరతో (Base Price) వేలానికి వచ్చిన ఇతని ధర క్షణాల్లోనే రూ. 13 కోట్లు దాటడం నిజంగా ఒక అద్భుతం.
ఐపీఎల్ వేలంలో పేరొందిన స్టార్ల కంటే.. అంతగా పరిచయం లేని ఆటగాళ్లే కొన్నిసార్లు సంచలనాలు సృష్టిస్తుంటారు. తాజాగా ఆకిబ్ నబీ విషయంలో అదే జరిగింది. కేవలం రూ. 30 లక్షల కనీస ధరతో (Base Price) వేలానికి వచ్చిన ఇతను, ఏకంగా రూ. 8.40 కోట్లకు అమ్ముడుపోయి వార్తల్లో నిలిచాడు.
రాజవర్ధన్ హంగర్గేకర్
తనుష్ కోటియన్
శివాంగ్ కుమార్
మహిపాల్ లోమ్రోర్
కమలేష్ నాగర్కోటి
విజయ్ శంకర్
సన్వీర్ సింగ్
ఎడెన్ టామ్
ప్రశాంత్ వీర్
అన్మోల్‌ప్రీత్ సింగ్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు
అభినవ్ తేజ్రానా – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు
అభినవ్ మనోహర్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు
యష్ ధుల్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు
ఆర్య దేశాయ్ – రూ. 30 లక్షలు – అమ్ముడుపోలేదు
కామెరూన్ గ్రీన్ – 25.20 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
వానిందు హసరంగా – 2 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
వెంకటేష్ అయ్యర్ – 7 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
క్వింటన్ డి కాక్ – 1 కోటి – ముంబై ఇండియన్స్
బెన్ డకెట్ – 2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
ఫిన్ అలెన్ – 2 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
జాకబ్ డఫీ – 2 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మతీషా పతిరణ – 18 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
అన్రిచ్ నార్ట్జే – 2 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
రవి బిష్ణోయ్ – 7.20 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
అకేల్ హోసేన్ – 2 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
రవి బిష్ణోయ్ రూ. 2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) బిడ్డింగ్‌ను ప్రారంభించగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రూ. 2.20 కోట్లతో పోటీలోకి వచ్చింది.
ఈ రెండు జట్లు బిడ్డింగ్‌ను కొనసాగించడంతో ధర రూ. 4 కోట్లు దాటింది. రూ. 4.40 కోట్ల వద్ద తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు CSK చెప్పినప్పటికీ, వెంటనే రూ. 4.60 కోట్లకు ప్యాడిల్ ఎత్తింది. దీంతో RR కాసేపు ఆలోచించి రూ. 4.80 కోట్లకు బిడ్ వేసింది.
CSK వద్ద ఎక్కువ పర్సు (డబ్బు) ఉన్నప్పటికీ, RR పట్టువదలకుండా పోటీలో కొనసాగుతోంది. ప్రస్తుతం బిడ్ రూ. 6 కోట్ల వద్ద RR చేతిలో ఉంది. చివరకు ఈ బౌలర్ ను రాజస్తాన్ రాయల్స్ టీం వేలంలో రూ.7.20కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
మతీషా పతిరానా కనీస ధర రూ. 2 కోట్లు. ఇప్పటివరకు కేవలం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున మాత్రమే ఆడాడు. ఈ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బిడ్డింగ్ ప్రారంభించగా, వెంటనే లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పోటీలోకి వచ్చింది. ప్రతి బిడ్‌కు రూ. 20 లక్షల చొప్పున పెరుగుతూ, చాలా వేగంగా ఇతని ధర రూ. 5 కోట్లు దాటిపోయింది.
చివరకు రూ. 18 కోట్లకు కేకేఆర్ దక్కించుకంది.
దీంతో మూడవ సెట్ (క్యాప్డ్ వికెట్ కీపర్లు – జాతీయ జట్టుకు ఆడిన వికెట్ కీపర్లు) ప్రారంభమైంది. కేఎస్ భరత్ రూ. 75 లక్షల కనీస ధరతో వేలానికి రాగా, అతను అమ్ముడుపోలేదు.
మాజీ కేకేఆర్ ఆల్ రౌండర్ అయిన వెంకటేష్ అయ్యర్ రూ. 2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మరోసారి అందరికంటే ముందుగా బిడ్ వేసింది. గుజరాత్ టైటాన్స్ (GT) ఇప్పుడు రూ. 2.20 కోట్లతో బిడ్డింగ్‌లోకి వచ్చింది.
రూ. 2.80 కోట్ల వద్ద GT పోటీ నుండి తప్పుకుంది. వెంటనే ఆర్సీబీ (RCB) రూ. 3 కోట్లతో పోటీలోకి వచ్చింది. కానీ LSG ధరను పెంచుతూనే ఉంది. ఆ తర్వాత కేకేఆర్ (KKR) రూ. 3.60 కోట్లతో బిడ్డింగ్‌లో చేరింది. కానీ RCB మరోసారి బిడ్ వేసింది.
ధర ఇప్పుడు రూ. 5 కోట్లు దాటింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గత ఏడాది జరిగిన మెగా వేలంలో కూడా ఇతని కోసం ఆర్సీబీ మరియు కేకేఆర్ జట్లే తీవ్రంగా పోటీ పడ్డాయి.
చివరకు వెంకటేష్ అయ్యర్‌ను RCB రూ. 7 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది.
క్యాప్డ్ బ్యాటర్ల (అంతర్జాతీయ అనుభవం ఉన్న బ్యాటర్లు) విభాగమైన మొదటి సెట్ ఇక్కడితో ముగిసింది. వేలానికి ఇప్పుడు ఐదు నిమిషాల విరామం ఇవ్వబడింది. ఈ సెట్‌లో కేవలం ఇద్దరు ఆటగాళ్ళు మాత్రమే అమ్ముడుపోయారు.
డేవిడ్ మిల్లర్ తన కనీస ధర అయిన రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వెళ్ళాడు. ఇక ఈ సెట్‌లో కామెరూన్ గ్రీన్ అతిపెద్ద కొనుగోలుగా నిలిచాడు. ఇతను రూ. 25.50 కోట్ల భారీ మొత్తానికి KKR జట్టు సొంతమయ్యాడు.
ఆస్ట్రేలియాకు చెందిన ఈ 26 ఏళ్ల ఆటగాడి కోసం ముంబై ఇండియన్స్ (MI) రూ. 2 కోట్లతో బిడ్డింగ్‌ను ప్రారంభించగా, వెంటనే రాజస్థాన్ రాయల్స్ (RR) రూ. 2.20 కోట్లతో పోటీలోకి వచ్చింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ. 2.60 కోట్లకు బిడ్ వేసింది. RR ధరను రూ. 3.40 కోట్లకు పెంచినప్పటికీ, KKR పట్టు వీడలేదు.
ఈ రెండు జట్లు ఆటగాడి కోసం హోరాహోరీగా పోటీ పడటంతో ధర రూ. 5 కోట్లు దాటింది. బిడ్డింగ్ కొనసాగుతూనే ఉంది మరియు ఈ రెండు జట్లే ఇంకా పోటీలో ఉన్నాయి. ధర ఇప్పుడు రూ. 9 కోట్లు దాటిపోయింది. మూడో జట్టు రేసులోకి ఎప్పుడు వస్తుందా అని అంతా వేచి చూస్తున్నారు.
RR వద్ద కేవలం రూ. 16.05 కోట్ల పర్సు (సొమ్ము) మాత్రమే ఉండటంతో, రూ. 13.60 కోట్ల వద్ద ఆ జట్టు పోటీ నుండి వెనక్కి తగ్గింది. ప్రస్తుతం బిడ్ KKR వద్ద ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రూ. 13.80 కోట్లతో బరిలోకి దిగింది.
అందరూ ఊహించినట్లే గ్రీన్‌ను దక్కించుకోవడానికి CSK మరియు KKR ప్రధాన పోటీదారులుగా మారాయి. ధర రూ. 17 కోట్లు దాటింది. రూ. 19 కోట్ల వద్ద KKR కాసేపు దీర్ఘంగా ఆలోచించి, చివరకు రూ. 19.20 కోట్లకు బిడ్ వేసింది.
చివరకు కేకేఆర్ కామెరాన్ గ్రీన్‌ను రూ. 25.20 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అతను ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. స్వదేశీయుడు మిచెల్ స్టార్క్‌ను అధిగమించాడు.
జట్టులో ప్రాధాన్యత కోల్పోయిన ఈ ఆటగాడు రూ. 75 లక్షల కనీస ధరతో వేలానికి వచ్చాడు. కానీ ఇతను అమ్ముడుపోలేదు!
వేలంలో వచ్చిన రెండవ ఆటగాడు దక్షిణాఫ్రికా వెటరన్ (సీనియర్) డేవిడ్ మిల్లర్. ఇతని కనీస ధర కూడా రూ. 2 కోట్లు.
మరోసారి, ఆరంభంలో జట్లు బిడ్ వేయడానికి ఆసక్తి చూపలేదు. చాలా సేపటి నిరీక్షణ తర్వాత చివరగా ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్డింగ్ ప్రారంభించింది. మరే ఇతర జట్టు పోటీలో లేకపోవడంతో, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఆటగాడిని దక్కించుకుంది.
వేలంలో వచ్చిన మొదటి ఆటగాడు ఈ ఆస్ట్రేలియా ఓపెనర్. ఇతని కనీస ధర రూ. 2 కోట్లు కాగా, ఇతను అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు (Unsold). ఇతని కోసం ఎవరూ బిడ్ వేయలేదు.
IPL 2026 వేలం సాధారణంగా అంతర్జాతీయ ఆటగాళ్ల సెట్‌తో ప్రారంభమవుతుంది. జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కామెరాన్ గ్రీన్, డెవాన్ కాన్వే, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా మొదట పిలవనున్నారు. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్, ఆల్ రౌండర్లు, వికెట్ కీపర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఉంటారు. మొదటి ఐదు సెట్‌లలో మొత్తం 34 మంది ఆటగాళ్లు పోటీ పడతారని భావిస్తున్నారు.
ప్రతి సీజన్‌లోనూ ఆర్‌సీబీ తరఫున ఆడిన విరాట్ కోహ్లీ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని ఖాతాలో ఎనిమిది సెంచరీలు సహా 8,661 పరుగులు ఉన్నాయి. 19వ సీజన్‌లో అతను 9,000 పరుగులు చేరుకోగలడు. టోర్నమెంట్‌లో రెండవ అత్యధిక పరుగులు చేసిన రోహిత్ శర్మ కింగ్ కోహ్లీ కంటే దాదాపు 1,600 పరుగులు వెనుకబడి ఉన్నాడు.
2008లో ఐపీఎల్ ప్రారంభమైంది. రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఫైనల్‌లో ఓడించి తొలి సీజన్‌ను గెలుచుకుంది. 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలి టైటిల్‌ను గెలుచుకుంది. CSK, MI జట్లు ఐదు టైటిళ్లను గెలుచుకున్నాయి. KKR మూడు టైటిళ్లతో మూడవ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.
ఐపీఎల్ 19వ సీజన్ మార్చి మూడవ వారంలో ప్రారంభం కానుంది. టోర్నమెంట్ తేదీలు ఇంకా ఖరారు కాలేదు. కానీ మార్చి . మే మధ్య జరిగే అవకాశం ఉంది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడి రికార్డు భారతదేశానికి చెందిన రిషబ్ పంత్ పేరిట ఉంది. గత సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ అతన్ని రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అతని తర్వాత పంజాబ్ కింగ్స్‌కు చెందిన శ్రేయాస్ అయ్యర్ కూడా గత సీజన్‌లో రూ. 26.75 కోట్లు ధరను అందుకున్నాడు.
IPL మినీ వేలంలో, చాలా మంది ఆటగాళ్ల బిడ్‌లు తరచుగా మునుపటి రికార్డులను బద్దలు కొడతాయి. ఇప్పటివరకు, ఆరుగురు ఆటగాళ్లు రూ. 16 కోట్లకు అమ్ముడయ్యారు. వీరిలో, ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ , పాట్ కమ్మిన్స్ బిడ్‌లు రూ. 20 కోట్లను అధిగమించాయి.
ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో పెద్దగా పెద్ద ఆటగాళ్లు పాల్గొనడం లేదు. ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డు ప్లెసిస్, మోయిన్ అలీ వంటి అనుభవజ్ఞులు రిజిస్టర్ చేసుకోలేదు. అందువల్ల, ఆస్ట్రేలియాకు చెందిన యువ ఆటగాడు కామెరాన్ గ్రీన్, శ్రీలంకకు చెందిన మతీష్ పతిరానా, భారత ఆటగాడు రవి బిష్ణోయ్, ఇంగ్లాండ్‌కు చెందిన జామీ స్మిత్, ఫామ్‌లో లేని లియామ్ లివింగ్‌స్టోన్ మాత్రమే గణనీయమైన బిడ్‌లను ఆకర్షించే అవకాశం ఉంది.
భారతదేశంలో దేశవాళీ క్రికెట్ ఆడే కొంతమంది ఆటగాళ్ల బిడ్‌లు కూడా ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. వారిలో, జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ గురించి ఎక్కువగా చర్చనీయాంశమైంది. అతనితో పాటు, స్పిన్నర్లు ప్రశాంత్ వీర్, శివం శుక్లా, ఫాస్ట్ బౌలర్లు అశోక్ శర్మ, క్రెయిన్స్ ఫులేట్రా, వికెట్ కీపర్ కార్తీక్ శర్మ కూడా జట్ల నుంచి గణనీయమైన బిడ్‌లను ఆకర్షించవచ్చు.
వేలం అంతర్జాతీయ ఆటగాళ్ల సెట్‌తో ప్రారంభమవుతుంది. ప్రతి సెట్‌లో వివిధ వర్గాలకు చెందిన ఆటగాళ్ళు ఉంటారు. ఆటగాళ్ల పేర్లను బ్యాట్స్‌మెన్, ఆల్ రౌండర్లు, వికెట్ కీపర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్ల క్రమంలో ఉంచుతారు. అంతర్జాతీయ ఆటగాళ్ల తర్వాత, అన్‌క్యాప్డ్ (లేదా దేశీయ) ఆటగాళ్ళు అదే క్రమంలో అనుసరిస్తారు. చివరి ఆటగాడి పేరు పెట్టే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
వేలంలో ఆటగాళ్ల బేస్ ధర రూ. 30 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఉంటుంది. బేస్ ధర అనేది ఒక ఆటగాడి బిడ్డింగ్ ప్రారంభమయ్యే ధరను సూచిస్తుంది. ఈసారి, 40 మంది ఆటగాళ్లకు అత్యధిక బేస్ ధర రూ. 2 కోట్లు. 30 మంది ఆటగాళ్లకు బేస్ ధర రూ.1, రూ 1.5 కోట్ల మధ్య ఉంటుంది. అదే సమయంలో, 228 మంది ఆటగాళ్లకు ప్రారంభ ధర రూ. 30, రూ. 75 లక్షల మధ్య ఉంటుంది.
IPL సీజన్ ముగిసిన తర్వాత, ఆటగాళ్ల ట్రేడింగ్ విండో తెరుచుకుంటుంది. ఇది వేలానికి ఒక నెల ముందు వరకు ఉంటుంది. ఈసారి, ట్రేడింగ్ విండోలో జట్లు ఎనిమిది మంది ఆటగాళ్లను మార్పిడి చేసుకున్నాయి. వారిలో ముగ్గురు అతిపెద్ద పేర్లు సంజు సామ్సన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ. సామ్సన్ రాజస్థాన్ నుంచి చెన్నైకి, జడేజా చెన్నై నుండి రాజస్థాన్‌కు, షమీ హైదరాబాద్ నుంచి లక్నోకు మారారు.
పది జట్లు 173 మంది ఆటగాళ్లను నిలుపుకున్నాయి. వీరిలో 45 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. పది జట్లు 250 మంది ఆటగాళ్లను చేర్చుకోవచ్చు. అందులో 80 మంది విదేశీ ఆటగాళ్లు ఉండాలి. అంటే వేలంలో 77 ఖాళీలు ఉన్నాయి. కానీ ఈ స్లాట్లలో 25 విదేశీ ఆటగాళ్లకు ఉన్నాయి. అంటే 52 మంది భారతీయ ఆటగాళ్లు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటారు.
అతి తక్కువ మంది ఆటగాళ్లను నిలుపుకున్న KKR, అత్యధిక పర్స్ కలిగి ఉంది. రూ. 64.30 కోట్లతో వేలంలోకి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రూ. 43.40 కోట్లతో తర్వాతి స్థానంలో ఉంది. ముంబై అత్యల్ప పర్స్ రూ. 2.75 కోట్లు కలిగి ఉంది. RCB, RR, PBKS, GT రూ. 11 కోట్ల నుంచి రూ.17 కోట్ల వరకు పర్స్ కలిగి ఉన్నాయి. DC, LSG, SRH రూ. 21 కోట్ల నుంచి రూ. 26 కోట్ల వరకు పర్స్ కలిగి ఉన్నాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)లో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. 13 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఆ జట్టు కేవలం 12 మంది ఆటగాళ్లను మాత్రమే నిలుపుకుంది. వేలంలో ఆరుగురు విదేశీ ఆటగాళ్లను కూడా కొనుగోలు చేస్తుంది. పంజాబ్ కింగ్స్ (PBKS)లో అతి తక్కువ ఖాళీలు ఉన్నాయి. నలుగురు మాత్రమే ఉన్నారు. మునుపటి రన్నరప్ 21 మంది ఆటగాళ్లను నిలుపుకుంది. ఒక జట్టులో 22 నుంచి 25 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. పంజాబ్ తర్వాత, ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT)లో ఐదు ఖాళీలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 1,390 మంది ఆటగాళ్లు వేలం కోసం నమోదు చేసుకున్నారు. అయితే, జట్లు ఈ ఆటగాళ్లలో కొంతమందిని మాత్రమే ఎంపిక చేసి, వారిని సొంతం చేసుకోవడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. అందువల్ల, వేలానికి ముందు, BCCI టాప్ 350 ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ ఆటగాళ్లను మాత్రమే నేటి వేలంలో చేర్చనున్నారు.
IPL ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మెగా వేలం నిర్వహిస్తుంది. జట్లు ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే నిలుపుకోగలవు. దీనివల్ల ఎక్కువ మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. మెగా వేలం మధ్య ప్రతి రెండు సంవత్సరాలకు ఒక మినీ వేలం జరుగుతుంది. దీని వలన జట్లు ఎక్కువ మంది ఆటగాళ్లను నిలుపుకోగలుగుతాయి. తక్కువ మంది ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి. 2025 IPL కోసం మెగా వేలం నిర్వహించారు. కాబట్టి 2026, 2027 IPLలకు మినీ వేలం నిర్వహిస్తారు.
IPL మినీ వేలం UAEలోని అబుదాబిలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. వేలం ఒకే రోజు జరుగుతుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దేశంలోని రెండు ఫ్రాంచైజీ లీగ్‌లైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లను నిర్వహిస్తుంది. BCCI నేడు IPL మెగా వేలాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈసారి కూడా మల్లికా సాగర్ వేలంపాట నిర్వహించనుంది.