IPL 2026: రిలీజ్ లిస్ట్ వచ్చేసింది.. 10 జట్ల స్క్వాడ్స్‌లో ఎవరెవరు ఉన్నారో తెలుసా ?

ఐపీఎల్ 2026 మెగా టోర్నమెంట్‌కు ముందు అన్ని 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఈ రిటెన్షన్ ప్రక్రియ తర్వాత చాలా జట్ల మెయిన్ స్క్వాడ్స్ ఖరారయ్యాయి. మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి డిసెంబర్ 16న ఐపీఎల్ ఆక్షన్ జరగనుంది.

IPL 2026: రిలీజ్ లిస్ట్ వచ్చేసింది.. 10 జట్ల స్క్వాడ్స్‌లో ఎవరెవరు ఉన్నారో తెలుసా ?
Ipl 2026 Teams

Updated on: Nov 19, 2025 | 6:11 PM

IPL 2026: ఐపీఎల్ 2026 మెగా టోర్నమెంట్‌కు ముందు అన్ని 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఈ రిటెన్షన్ ప్రక్రియ తర్వాత చాలా జట్ల మెయిన్ స్క్వాడ్స్ ఖరారయ్యాయి. మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి డిసెంబర్ 16న ఐపీఎల్ ఆక్షన్ జరగనుంది. ఈ రిటెన్షన్ తర్వాత కొన్ని జట్లు పటిష్టంగా ఉండగా, మరికొన్ని జట్లు మాత్రం వేలంలో భారీగా ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది.

ఈ ఏడాది రిటెన్షన్‌లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు అతి తక్కువ మంది ఆటగాళ్లను (కేవలం 12 మందిని) నిలుపుకుంది. దీంతో కేకేఆర్‌కు ఆక్షన్‌లో ఏకంగా 13 స్లాట్లు (6 విదేశీ స్లాట్లు) ఖాళీగా ఉన్నాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT) వంటి మూడు జట్లు 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లను నిలుపుకోవడం ద్వారా తమ మెయిన్ టీమ్ స్ట్రెంత్‌ను కాపాడుకున్నాయి.

ప్రధాన జట్ల స్క్వాడ్ వివరాలు

చెన్నై సూపర్ కింగ్స్ (CSK): ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే వంటి కీలక ఆటగాళ్లతో CSK 16 మందిని రిటైన్ చేసుకుంది. వారికి 9 స్లాట్లు (4 విదేశీ) ఖాళీగా ఉన్నాయి.

ముంబై ఇండియన్స్ (MI): రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా వంటి పటిష్టమైన ఆటగాళ్లతో MI ఏకంగా 20 మందిని నిలుపుకుంది. కేవలం 5 స్లాట్లు (1 విదేశీ) మాత్రమే ఖాళీగా ఉన్నాయి.

గుజరాత్ టైటాన్స్ (GT): శుభమాన్ గిల్ కెప్టెన్సీలోని జీటీ 20 మంది ఆటగాళ్లను నిలుపుకుంది. వారి వద్ద 5 స్లాట్లు (4 విదేశీ) ఉన్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్ వంటి ఆటగాళ్లతో SRH 15 మందిని రిటైన్ చేసుకుంది. వీరికి 10 స్లాట్లు (2 విదేశీ) ఆక్షన్‌లో అందుబాటులో ఉన్నాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 12 మంది ఆటగాళ్లనే నిలుపుకోవడం వలన, డిసెంబర్ 16న జరిగే వేలంలో అత్యధిక మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 17 మందిని, లక్నో సూపర్ జెయింట్స్ 19 మందిని, రాజస్థాన్ రాయల్స్ 16 మందిని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 మందిని నిలుపుకున్నాయి. ఈ జట్లు మిగిలిన ఖాళీ స్లాట్‌లను భర్తీ చేసుకోవడానికి వేలంపై దృష్టి సారించాయి.

ఫైనల్ స్క్వాడ్ జాబితా

(ప్రస్తుతానికి ఖరారైన ఆటగాళ్ల వివరాలు):

పంజాబ్ కింగ్స్: అత్యధికంగా 21 మందిని నిలుపుకుంది.

ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్: 20 మందిని నిలుపుకున్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్: 19 మందిని నిలుపుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 17 మందిని నిలుపుకున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్: 16 మందిని నిలుపుకున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్: 15 మందిని నిలుపుకుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్: అతి తక్కువగా 12 మందిని నిలుపుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..