Video: కెప్టెన్ రియాన్ పరాగ్, వైభవ్ సూర్యవంశీ మధ్య కోల్డ్ వార్..? వైరల్ వీడియోతో దుమారం..!

Riyan Parag vs Vaibhav Suryavanshi: హై-వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్ల మధ్య ఇలాంటి వాతావరణం కనిపించడం రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి ఆందోళన కలిగించే విషయమే. సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి బలమైన బ్యాటింగ్ జట్టును ఎదుర్కోవాలంటే, రాయల్స్ ఈ చిన్నపాటి మనస్పర్థలను పక్కనపెట్టి మైదానంలో కలిసికట్టుగా పోరాడాల్సి ఉంటుంది.

Video: కెప్టెన్ రియాన్ పరాగ్, వైభవ్ సూర్యవంశీ మధ్య కోల్డ్ వార్..? వైరల్ వీడియోతో దుమారం..!
Riyan Parag Vaibhav Suryavanshi Video

Updated on: May 26, 2026 | 4:01 PM

Riyan Parag vs Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఉత్కంఠ రేపుతున్న వేళ రాజస్థాన్ రాయల్స్ క్యాంప్‌లో తీవ్ర కలకలం రేగింది. మైదానంలో పరుగుల వరద పారిస్తున్న సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ మధ్య విభేదాలు భగ్గుమన్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ముంబై విమానాశ్రయంలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ ఆసక్తికర ఘటనే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్లేఆఫ్స్ సంబరాల్లో ఊహించని షాక్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తర్వాత ఈ ఏడాది ప్లేఆఫ్స్ చేరిన నాలుగో జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ కోసం జట్టు ముంబై నుంచి చండీగఢ్‌కు విమానంలో ప్రయాణమైంది. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించిన ఉత్సాహంలో ఉన్న రాయల్స్ ఆటగాళ్లు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఈ వివాదం చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: IPL 2026 Winner: ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే: రికీ పాంటింగ్

ఒక్క వ్యాఖ్య.. ఇద్దరి మధ్య చూపుల యుద్ధం..!

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆటగాళ్ల ఫొటోలను తీసేందుకు మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒక ఫోటోగ్రాఫర్ కెప్టెన్ రియాన్ పరాగ్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలను కలిసి ఒక ఫోటో ఇవ్వాల్సిందిగా కోరాడు. దీనికి పరాగ్ తనదైన శైలిలో స్పందిస్తూ, “మేమేమీ సినిమా స్టార్లం కాదు” అంటూ ఫోటో ఇవ్వడానికి నిరాకరించాడు. పరాగ్ చేసిన ఈ వ్యాఖ్య పక్కనే ఉన్న 15 ఏళ్ల వైభవ్‌కు నచ్చలేదు. దాంతో ఆయన తన కెప్టెన్‌ను ఎంతో సీరియస్‌గా, కోపంగా చూస్తూ ఉండిపోయాడు. ఈ చూపుల యుద్ధానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది.

రాజస్థాన్ వన్-మ్యాన్ ఆర్మీ వైభవ్..

ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టును వైభవ్ సూర్యవంశీ ఒంటిచేత్తో ముందుకు నడిపిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే జస్‌ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను నెట్ బౌలర్లకంటే హీనంగా బాదేస్తున్నాడు. తన కెరీర్లో రెండో ఐపీఎల్ సీజన్ ఆడుతున్న ఈ ఎడంచేతి వాటం బ్యాటర్.. 232.27 స్ట్రైక్ రేట్‌తో దాదాపు 600 పరుగులు సాధించాడు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ రాణిస్తున్నప్పటికీ, వైభవ్ ఆడే ఇన్నింగ్స్ జట్టు విజయాల్లో కీలక తేడాను చూపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: IPL 2026 Playoffs: ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే.. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్..!

గురువు స్థానంలో ఉండి.. ఇప్పుడు దూరం?

నిజానికి వైభవ్ సూర్యవంశీ ఇంతలా రాణించడం వెనుక రియాన్ పరాగ్ ప్రోత్సాహం ఎంతో ఉంది. సంజూ శామ్సన్ ఈ సీజన్లో చెన్నై జట్టుకు మారడంతో, రాజస్థాన్ సారథ్య బాధ్యతలను పరాగ్ అందుకున్నాడు. పరాగ్ నాయకత్వంలోనే వైభవ్ గత సీజన్లో అరంగేట్రం చేశాడు. కుమార్ సంగక్కర నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ కూడా పరాగ్ కెప్టెన్సీని ఎంతగానో సమర్థించింది. మైదానంలో వైభవ్‌కు స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించింది కూడా పరాగే. కానీ, ఇప్పుడు వీరిద్దరి మధ్య విమానాశ్రయంలో జరిగిన ఈ సంఘటన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. వైభవ్ చాలా స్పష్టంగా, మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడే మనస్తత్వం కలవాడు కావడం వల్ల కూడా ఈ చిన్న వివాదం పెద్దదిగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్ హిస్టరీలో 13 ఏళ్ల ఐరెన్ లెగ్ ప్లేయర్.. ఏ జట్టులో చేరినా ట్రోఫీకి దూరమవ్వాల్సిందే..?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us