Watch : ఢిల్లీ ప్లేయర్లను వెక్కిరిస్తూ పరాగ్ వివాదాస్పద సెలబ్రేషన్.. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి బాసూ?

Watch : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై మెరుపు హాఫ్ సెంచరీ బాదిన తర్వాత వివాదాస్పద రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్ ఆరంభంలో పరుగుల కోసం ఇబ్బంది పడ్డ పరాగ్, ఢిల్లీపై మాత్రం విరుచుకుపడ్డాడు.

Watch : ఢిల్లీ ప్లేయర్లను వెక్కిరిస్తూ పరాగ్ వివాదాస్పద సెలబ్రేషన్.. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి బాసూ?
Riyan Parag

Updated on: May 18, 2026 | 9:01 AM

Watch : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అంటేనే టాలెంట్ ప్లస్ వివాదాల కలయిక. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి తన బ్యాటింగ్‌తోనే కాకుండా, తన వింత ప్రవర్తనతో ప్రత్యర్థి జట్టును అవమానించాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేస్తూ మెరుపు హాఫ్ సెంచరీ బాదిన పరాగ్.. ఆ తర్వాత డీసీ ప్లేయర్ల వైపు చూస్తూ చేసిన ఒక సైగ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. నేను మీకంటే వేరే లెవల్, మీరు నాకు సరితూగలేరనే అర్థం వచ్చేలా తను చేసిన సెలబ్రేషన్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఈ సీజన్ ఆరంభంలో పరుగుల కోసం ఇబ్బంది పడ్డ పరాగ్, ఢిల్లీపై మాత్రం విరుచుకుపడ్డాడు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన పరాగ్.. అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ బౌలింగ్‌ను టార్గెట్ చేశాడు. మైదానం నలుమూలలా 5 భారీ సిక్సర్లు బాది కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది పరాగ్ ఐపీఎల్ కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం. గతంలో కేకేఆర్ పై 27 బంతుల్లో చేసిన రికార్డును ఈ మ్యాచ్‌తో బద్దలు కొట్టాడు. బ్యాటింగ్‌తో అదరగొట్టిన పరాగ్.. సెలబ్రేషన్ దగ్గరకు వచ్చేసరికి తనలోని పాత అగ్రెసివ్ యాటిట్యూడ్‌ను బయటకు తీశాడు.

హాఫ్ సెంచరీ మార్కును చేరుకోగానే పరాగ్ బ్యాట్ పైకెత్తి అభివాదం చేయడం మానేసి.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ల కళ్లలోకి సూటిగా చూస్తూ ఒక వింత హావభావం ప్రదర్శించాడు. చేతులతో నేను ఒక ప్రత్యేకమైన స్థాయిలో ఉన్నాను, మీరు నా దరిదాపుల్లో కూడా లేరు అని వెక్కిరిస్తున్నట్లుగా ఆ సైగ ఉంది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్, నిపుణులు పరాగ్ ప్రవర్తనపై మండిపడుతున్నారు. ఆటలో దూకుడు ఉండాలి కానీ, ప్రత్యర్థి ఆటగాళ్లను కించపరచడం క్రీడా స్ఫూర్తి కాదని నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు. గతంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా బెంగాల్ ప్లేయర్ల పట్ల పరాగ్ ఇలాగే ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు.

సంజూ శాంసన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ పగ్గాలు చేపట్టిన పరాగ్‌కు ఈ సీజన్ మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచుల్లో కేవలం 258 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 25 వద్దే ఉండటంతో కెప్టెన్‌గా అతను విఫలమవుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. స్ట్రైక్ రేట్ (151) బాగున్నప్పటికీ, జట్టుకు అవసరమైనప్పుడు నిలకడగా రాణించలేకపోతున్నాడు. దీనికి తోడు ఇలాంటి అనవసరపు వివాదాలు అతని ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సైతం పరాగ్ టీమిండియా వైస్ కెప్టెన్ కావడంపై ప్రకటన ఇచ్చిన తరుణంలో, పరాగ్ తన ప్రవర్తన మార్చుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us