AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Ticket Scam : 600 వెబ్‌సైట్లు.. లక్షల మంది బాధితులు.. ఐపీఎల్ క్రేజ్‎ను క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు

IPL 2026 Ticket Scam : ఐపీఎల్ 2026 టికెట్ల పేరుతో భారీ మోసం జరుగుతోంది. 600కు పైగా నకిలీ వెబ్‌సైట్లు ఫేక్ టికెట్లు అమ్ముతూ డబ్బులు, డేటా దోచుకుంటున్నాయి. ఐపీఎల్ మీద ఉన్న అభిమానాన్ని ఇప్పుడు సైబర్ నేరగాళ్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు.

IPL 2026 Ticket Scam :  600 వెబ్‌సైట్లు.. లక్షల మంది బాధితులు.. ఐపీఎల్ క్రేజ్‎ను క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు
Ipl Trophy
Rakesh
|

Updated on: May 13, 2026 | 4:01 PM

Share

IPL 2026 Ticket Scam : భారతదేశంలో ఐపీఎల్ అంటే కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అదే పెద్ద క్రీడా పండుగ. తమకు ఇష్టమైన ఆటగాళ్లను స్టేడియంలో నేరుగా చూడాలని కోట్లాది మంది ఫ్యాన్స్ తహతహలాడుతుంటారు. అయితే, ఇదే అభిమానాన్ని ఇప్పుడు సైబర్ నేరగాళ్లు క్యాష్‎గా మార్చుకుంటున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ టికెట్ల పేరుతో భారీ ఎత్తున మోసాలు జరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏకంగా 600కు పైగా నకిలీ వెబ్‌సైట్లు అచ్చం అసలైన సైట్లలాగే కనిపిస్తూ ఫ్యాన్స్‌ను బురిడీ కొట్టిస్తున్నాయి. ఐపీఎల్ టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. దీంతో టికెట్లు దొరకని అభిమానులు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ నకిలీ సైట్ల లింకులు వారి కంట పడుతున్నాయి. ఈ వెబ్‌సైట్ల డిజైన్, రంగులు, ఫాంట్లు అన్నీ బుక్ మై షో లేదా ఇతర అధికారిక సైట్లలాగే ప్రొఫెషనల్‌గా ఉంటున్నాయి. దీనివల్ల సామాన్య అభిమానులు ఇవి నిజమైనవే అని నమ్మి వేల రూపాయలు చెల్లించి నకిలీ టికెట్లను కొనుగోలు చేస్తున్నారు.

పెద్ద మ్యాచ్‌లే వీరి టార్గెట్

ఈ కేటుగాళ్లు ముఖ్యంగా కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్న మ్యాచ్‌లను టార్గెట్ చేస్తున్నారు. RCB vs CSK లేదా CSK vs MI వంటి హై-వోల్టేజ్ మ్యాచ్‌ల టికెట్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంటుందని గ్రహించి, అవే టికెట్లు తమ వద్ద ఉన్నాయని ప్రకటనలు ఇస్తున్నారు. ఎస్‌ఎమ్‌ఎస్, వాట్సాప్ మెసేజ్‌లు, ఫేస్‌బుక్ యాడ్స్ ద్వారా ప్రజలను ఆకర్షించి, వారి అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. కేవలం డబ్బులే కాకుండా, 400కు పైగా నకిలీ స్ట్రీమింగ్ సైట్లు కూడా యూజర్ల వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు.

స్టేడియానికి వెళ్లేదాకా తెలియని చేదు నిజం

ఈ నకిలీ సైట్లలో పేమెంట్ చేసిన వెంటనే అచ్చం ఒరిజినల్ లాగే ఉండే పీడీఎఫ్ టికెట్ వాట్సాప్ లేదా మెయిల్‌కు వస్తుంది. ఆ టికెట్ పట్టుకుని ఎంతో ఆశతో స్టేడియానికి వెళ్ళిన అభిమానులకు గేటు దగ్గర అసలు విషయం తెలుస్తోంది. అక్కడ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్ చేసినప్పుడు అది ఫేక్ అని తేలడంతో ఫ్యాన్స్ లబోదిబోమంటున్నారు. అప్పటికే ఆ వెబ్‌సైట్లు గానీ, సోషల్ మీడియా పేజీలు గానీ మాయమైపోతున్నాయి. ఏఐ టెక్నాలజీని వాడుకుని సెర్చ్ ఇంజన్లలో తమ సైట్లు పైన వచ్చేలా ఈ ముఠా ప్లాన్ చేస్తోంది.

మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఐపీఎల్ టికెట్లను ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి.

* యూఆర్ఎల్  చెక్ చేయండి: వెబ్‌సైట్ అడ్రస్ స్పెల్లింగ్‌ను జాగ్రత్తగా గమనించండి. ఉదాహరణకు bookmyshow బదులు bookmishow అని ఉంటే అది ఫేక్.

* అధికారిక యాప్స్: కేవలం IPL అధికారిక వెబ్‌సైట్ లేదా ఫ్రాంచైజీల అఫీషియల్ వెబ్‌సైట్ల ద్వారా వచ్చే లింకులనే నమ్మండి.

* తక్కువ ధరకు టికెట్లు: ఎవరైనా బ్లాక్ లో లేదా తక్కువ ధరకు టికెట్లు ఇస్తామని లింకులు పంపితే వాటిని క్లిక్ చేయకండి.

* సోషల్ మీడియా ఆఫర్లు: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అమ్మే టికెట్లను అస్సలు కొనుగోలు చేయవద్దు. మీ డేటా, డబ్బులను జాగ్రత్తగా కాపాడుకోండి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!