IPL 2026 : అందుకే ఓడిపోయాం.. కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం

IPL 2026 : ఐపీఎల్ 2026లో చెన్నై చేతిలో ఓటమి తర్వాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పిన్ భాగస్వామి కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై పరోక్షంగా విమర్శలు చేయడంతో చర్చ మొదలైంది. ఢిల్లీ ఓటమికి అసలు కారణాలేంటి? ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా ఉన్నాయా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

IPL 2026 : అందుకే ఓడిపోయాం.. కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం
Ipl 2026

Updated on: May 06, 2026 | 11:20 AM

IPL 2026 : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ముఖ్యంగా తన స్పిన్ భాగస్వామి కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై అక్షర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. వికెట్లు తీయడంలో కుల్దీప్ విఫలమవ్వడం జట్టు ఓటమిపై గట్టి ప్రభావం చూపిందని అక్షర్ పరోక్షంగా అంగీకరించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ ప్రదర్శన చాలా పేలవంగా సాగింది. 3 ఓవర్లు వేసిన కుల్దీప్ ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మ్యాచ్ అనంతరం అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. “బౌలింగ్‌లో నా పార్ట్‌నర్ కుల్దీప్ పదునును నేను మిస్ అయ్యాను” అని అన్నాడు. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తున్నప్పటికీ, కుల్దీప్ ప్రభావం చూపలేకపోవడమే ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణమని అక్షర్ భావిస్తున్నాడు. సాధారణంగా ఈ ఇద్దరూ కలిసి ప్రత్యర్థులను కట్టడి చేసేవారు, కానీ ఈ సీజన్‌లో కుల్దీప్ ఫామ్ లేకపోవడం ఢిల్లీకి పెద్ద లోటుగా మారింది.

ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనిపై అక్షర్ స్పందిస్తూ.. “పిచ్ స్వభావాన్ని బట్టి చూస్తే 155 మంచి స్కోరే అనిపించొచ్చు. కానీ మేము ఎనిమిది మంది బ్యాటర్లతో బరిలోకి దిగాము. ఆ లెక్కన చూస్తే మేము మరో 10 నుంచి 15 పరుగులు తక్కువ చేశాము” అని అంగీకరించాడు. టాప్ ఆర్డర్ కుప్పకూలినా సమీర్ రిజ్వీ (40 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (38) పోరాటం వల్ల ఆ మాత్రం స్కోరైనా వచ్చిందని, అది ఒక్కటే పాజిటివ్ అని చెప్పుకొచ్చాడు.

పిచ్ కొత్త బ్యాటర్లకు చాలా కష్టంగా ఉందని, బంతి లో-బౌన్స్ అవుతూ ఇబ్బంది పెట్టిందని అక్షర్ వివరించాడు. కానీ సంజూ శాంసన్ వంటి సెటిల్ అయిన బ్యాటర్ క్రీజులో ఉంటే పిచ్ బ్యాటింగ్‌కు ఈజీగా అనిపిస్తుందని చెప్పాడు. సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను ఢిల్లీ నుంచి లాగేసుకున్నాడని కితాబిచ్చాడు. కొత్తగా వచ్చిన బ్యాటర్లు పిచ్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని, కానీ సెట్ అయిన బ్యాటర్లు మాత్రం ఇరక్కొట్టారని విశ్లేషించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. రాబోయే మ్యాచ్‌ల గురించి అక్షర్ మాట్లాడుతూ.. “ఇకపై మేము ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే క్లియర్ మైండ్‌సెట్‌తో ఆడాలి. వచ్చే శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్ మాకు చావోరేవో లాంటిది. అక్కడ కచ్చితంగా గెలవాల్సిందే” అని జట్టును హెచ్చరించాడు. కుల్దీప్ తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకుంటేనే ఢిల్లీకి గెలిచే అవకాశాలు ఉంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us