
కొన్ని గంటల్లో ఐపీఎల్ 2026 మినీ వేలం.. బరిలోకి దిగే 355 మంది ప్లేయర్స్‌లో ఈ ఐదుగురు ఆటగాళ్లు అత్యధిక ధర పలుకుతారని అంచనా వేస్తున్నారు. 2025 ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ భారీ ధరకు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఈసారి కూడాపలువురు ఆటగాళ్లు రికార్డు ధర పలికే అవకాశం ఉందని అంచనా. ఈ లిస్టులో ముందుగా వినిపిస్తోన్న పేరు కామెరూన్ గ్రీన్. ఈ ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ రెండింటిలోనూ రాణించగలడు. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ లాంటి జట్లు అతడి కోసం పోటీ పడే అవకాశం ఉంది. రూ. 25 నుంచి రూ. 30 కోట్లు పలుకుతాడని అంచనా. ఇక రెండో స్థానంలో మన ఇండియన్ స్పిన్నర్ రవి బిష్ణోయ్.. సుమారు రూ. 10-15 కోట్ల వరకు ధర పలకవచ్చు. ప్రస్తుతం వేలంలో ఎక్కువమంది అంతర్జాతీయ అనుభవం ఉన్న స్పిన్నర్లు లేకపోవడం కూడా రవి బిష్ణోయ్‌కు కలిసొచ్చే అంశం. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి జట్లు అతడి కోసం ప్రయత్నించవచ్చు.
లియామ్ లివింగ్‌స్టోన్ కూడా ఈ లిస్టులో లేకపోలేదు. ఆండ్రూ రస్సెల్ రిటైర్మెంట్, గ్లెన్ మాక్స్‌వెల్ లీగ్‌కు దూరం కావడంతో.. లివింగ్‌స్టోన్ వాల్యూ అమాంతం పెరిగిందని చెప్పొచ్చు. ఈ భారీ హిట్టర్, స్పిన్ ఆల్‌రౌండర్ కోసం రూ. 12-15 కోట్ల వరకు పోటీ పడే అవకాశం ఉంది. ఇక వెంకటేష్ అయ్యర్ కూడా రూ. 10-15 కోట్ల ధర పలికే అవకాశం ఉంది. లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్, మిడిల్ ఆర్డర్ హిట్టింగ్ అతడి ప్లస్ పాయింట్లు. మతీషా పతిరానా తన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్‌తో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి