IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే.. 5 నిమిషాలకే టికెట్లు బ్లాక్..

ఈ సీజన్లో జరుగుతున్న మొదటి ఐపీఎల్ మ్యాచ్ కావడంతో సాధారణంగానే హైదరాబాద్ వాసులు ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల ఆసక్తిని ఆసరాగా చేసుకున్న టికెటింగ్ ప్లాట్ఫామ్స్ తక్కువ ధర ఉన్న టికెట్లను నిమిషాల వ్యవధిలోనే బ్లాక్ చేసేసారు. ఎక్కువ రేటు ఉన్న టికెట్లను మాత్రం ఆన్లైన్లో అందుబాటులోనే ఉంచి టికెట్ సేల్స్ ను ఓపెన్ చేసామని ప్రకటించారు. దీంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు.

IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే.. 5 నిమిషాలకే టికెట్లు బ్లాక్..
Ipl 2025

Edited By: Jyothi Gadda

Updated on: Mar 07, 2025 | 1:15 PM

మార్చి 22 నుండి ప్రారంభమవుతున్న ఐపీఎల్ సీజన్ కు సంబంధించి టికెట్ల విక్రయం శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఐపీఎల్ టికెట్ల కొనుగోలు కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే టికెట్ల విక్రయాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే తక్కువ రేటు టికెట్ల విక్రయాలను బ్లాక్ చేసేస్తున్నారు. దీంతో సగటు క్రికెట్ అభిమాని తక్కువ రెట్ల గల టికెట్లను కొన్ని మ్యాచ్ చూసేందుకు ఉన్న ఆశను ఆవిరి చేసేస్తున్నారు. మరోవైపు అధిక రేటు ఉన్న టికెట్లు మాత్రం ఆన్లైన్లో అందుబాటులోనే ఉన్నాయి. అయితే దాని దొర ఒక్కో టికెట్ 5వేలకు పైబడి ఉండటంతో సామాన్యుడు వాటిపై ఆసక్తి చూపటం లేదు.

మిడిల్ క్లాస్ వాడికి అందుబాటులో ఉండే ధర 750, 1550 రూపాయల టికెట్లు మాత్రం బ్లాక్ చేసేసారు. దీంతో ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురవుతుందంటూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఇక కొంతమంది దిక్కు తోచని స్థితిలో అధిక రేట్లు ఉన్న టికెట్లను విక్రయిస్తున్నారు. అయితే టికెటింగ్ ప్లాట్ఫారం కావాలనే ఈ తరహాలో తక్కువ రేటు ఉన్న టికెట్లను ముందుగానే బ్లాక్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెటింగ్ ప్లాట్ ఫామ్ లపై బీసీసీఐ సరైన నిర్ణయాలు తీసుకోవాలంటూ డిమాండ్ పంపిస్తుంది.

ఇక హైదరాబాదులో మార్చి 23న ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ సీజన్లో జరుగుతున్న మొదటి ఐపీఎల్ మ్యాచ్ కావడంతో సాధారణంగానే హైదరాబాద్ వాసులు ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల ఆసక్తిని ఆసరాగా చేసుకున్న టికెటింగ్ ప్లాట్ఫామ్స్ తక్కువ ధర ఉన్న టికెట్లను నిమిషాల వ్యవధిలోనే బ్లాక్ చేసేసారు. ఎక్కువ రేటు ఉన్న టికెట్లను మాత్రం ఆన్లైన్లో అందుబాటులోనే ఉంచి టికెట్ సేల్స్ ను ఓపెన్ చేసామని ప్రకటించారు. దీంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సైతం టికెట్ల విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తామని పదేపదే ప్రకటనలు ఇస్తున్నప్పటికీ టికెటింగ్ ప్లాట్ఫామ్ చేస్తున్న బ్లాక్ దందాను మాత్రం అరికట్ట లేకపోతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.