IPL 2025: 3 ఏళ్లుగా ఆ ఆటగాడి కోసం ఎదురుచూపులు.. ఐపీఎల్ 2025కి ముందు నెరవేరిన డ్రీమ్

|

Nov 08, 2024 | 6:21 PM

Prabhsimran Singh: పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌తో ఐపీఎల్ 2025లోకి ప్రవేశించనుంది. ఇటీవల రికీ పాంటింగ్‌ను తన ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. అదే సమయంలో, ఈసారి జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది. ఈ ఆటగాళ్లలో ఒకరిని కొనుగోలు చేయడానికి రికీ పాంటింగ్ గత 3 సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు.

IPL 2025: 3 ఏళ్లుగా ఆ ఆటగాడి కోసం ఎదురుచూపులు.. ఐపీఎల్ 2025కి ముందు నెరవేరిన డ్రీమ్
Prabhsimran Singh Ipl 2025
Follow us on

IPL 2025: ఐపీఎల్ మెగా వేలానికి ముందు, పంజాబ్ కింగ్స్ జట్టు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. 17 ఏళ్లుగా టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పంజాబ్ జట్టు.. ఈసారి రికీ పాంటింగ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించింది. అతను ట్రెవర్ బేలిస్ స్థానంలో వచ్చాడు. ఇంతకు ముందు అతను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచ్‌గా ఉన్నాడు. పంజాబ్ జట్టు వచ్చే సీజన్‌లో కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్ జట్టు మరోసారి లీగ్‌లో కొత్త జట్టును నిర్మించేందుకు సిద్ధమైంది. పంజాబ్ జట్టు కేవలం ప్రభసిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్‌లను మాత్రమే ఉంచుకుంది.

కేవలం ఇద్దరు ఆటగాళ్లపైనే రికీ పాంటింగ్ బెట్టింగ్..

పంజాబ్ కింగ్స్‌లో అత్యంత ఖరీదైన రిటెన్షన్ శశాంక్ సింగ్‌దే కావడం గమనార్హం. అదే సమయంలో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను నిలువరించడానికి పంజాబ్ కింగ్స్ రూ.4 కోట్లు ఖర్చు చేసింది. గత సీజన్‌లో ప్రభసిమ్రాన్ సింగ్ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. అతను దాదాపు ప్రతి మ్యాచ్‌లో జట్టు కోసం పరుగులు చేశాడు. దాని కారణంగా అతను జట్టుతో ఉండగలిగాడు. అదే సమయంలో, ప్రభాసిమ్రాన్ సింగ్ జట్టు మొదటి ఎంపిక. అలాగే కొత్త ప్రధాన కోచ్ రికీ పాంటింగ్, గత 3 సంవత్సరాలుగా ప్రభాస్‌ని తన జట్టులో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాసిమ్రన్ వెల్లడించాడు.

ఇన్‌సైడ్ స్టోరీ చెప్పిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ..

ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ రిటైన్ అయిన తర్వాత తనతో మాట్లాడిన విషయాలను ప్రభ్‌సిమ్రాన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మాట్లాడుతూ, ‘మా కొత్త కోచ్ రికీ పాంటింగ్ అని మాకు తెలుసు. నాకు అతని నుంచి కాల్ వచ్చింది. అతను నాతో చక్కగా మాట్లాడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆయన కోచ్‌గా ఉన్నప్పుడు మూడేళ్లపాటు నన్ను ట్రేడ్‌ చేసేందుకు ప్రయత్నిచాడంట. ఆ వార్త విని నేను చాలా సంతోషంగా అనిపించింది. ఆయన నుంచి చాలా నేర్చుకుంటానని తెలిపాడు.

ప్రభ్‌సిమ్రన్ మాట్లాడుతూ, ‘టీమ్ నాపై చాలా నమ్మకాన్ని చూపించింది. నేను కూడా వారి అంచనాలను అందుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. వారికి శుభారంభం అందించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. వీలైనన్ని మ్యాచ్‌లు గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ IPL కెరీర్..

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 2019 నుంచి ఐపీఎల్‌లో భాగంగా ఉన్నాడు. గత రెండు సీజన్లలో, అతను ఆడటానికి పూర్తి అవకాశాలు పొందాడు. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో అతను విజయం సాధించాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 156.81 స్ట్రైక్ రేట్‌తో 334 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్‌తో రెండు అర్ధ సెంచరీలు కూడా కనిపించాయి. అదే సమయంలో, ఐపీఎల్ 2023లో కూడా అతను 350 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అంటే, అతను నిరంతరం పరుగులు చేస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..