
ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య చివరి బంతి వరకు ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఆఖరికి సూపర్ ఓవర్‌లో ఢిల్లీ విజయభేరి మోగించింది. ఈ తరుణంలో మ్యాచ్‌లో రాజస్థాన్ తరపున అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నితీష్ రాణాకు సూపర్ ఓవర్‌లో ఛాన్స్ ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో నితీష్ అత్యుత్తమ బ్యాటింగ్ చేశాడు. అతడు కేవలం 28 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అంతేకాదు రాజస్థాన్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ(21 బంతుల్లో) పూర్తి చేశాడు. మరి ఇంతటి ఫామ్‌లో ఉన్నప్పటికీ.. ఆఖరి సూపర్ ఓవర్‌లో నితీష్ రాణాను బ్యాటింగ్‌కు దింపలేదు ఆర్ఆర్ కోచ్ రాహుల్ ద్రావిడ్.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్‌కు నిర్దేశించింది. ఇక ఆ లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. కొద్దిసేపు ఆట ఆడిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ 19 బంతుల్లో 31 పరుగులు చేసిన రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ 76 పరుగుల వద్ద రియాన్ పరాగ్ వికెట్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ మరో ఎండ్‌లో పరుగులు సాధించినప్పటికీ.. వరుస ఇంటర్వల్స్‌లో రాజస్థాన్ వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ మొత్తంగా 37 బంతుల్లో 137 స్ట్రైక్ రేట్‌తో 51 పరుగులు చేశాడు. ఆ తర్వాత నితీష్ రాణా 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతని కారణంగానే మ్యాచ్ రాజస్థాన్‌కు అనుకూలంగా మారింది. అయితే నితీష్ రాణా 18వ ఓవర్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. చివర్లో ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్ మ్యాచ్‌ను టై చేయగలిగారు. దీన్ని బట్టి చూస్తే నితీష్ వల్ల రాజస్థాన్ జట్టు ఓటమి నుంచి సూపర్ ఓవర్ వరకు వెళ్ళిందన మాట.
సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ బ్యాటింగ్‌కు వచ్చారు. కానీ స్టార్క్ ప్రమాదకరమైన యార్కర్ల ముందు వాళ్లు తేలిపోయారు. నాలుగో బంతికి పరాగ్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే జైస్వాల్ రనౌట్ అయ్యాడు. ఈ విధంగా, వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత, రాజస్థాన్ మొత్తం సూపర్ ఓవర్ కూడా ఆడలేకపోయింది. 5 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసింది. అటు ఈ టార్గెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన కెఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ 4 బంతుల్లోనే చేధించారు.
నితీష్ రాణా అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌పై 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు కేవలం 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఇది మిచెల్ మార్ష్‌తో కలిసి ఈ సీజన్‌లో రెండవ వేగవంతమైన అర్ధ సెంచరీ. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఇదే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ.