Video: వామ్మో.. గాల్లోకి ఎగిరి బౌండరీ లైన్‌లో కళ్ల చెదిరే క్యాచ్.. వీడియో చూస్తే ఫిదానే

Jake Fraser Mcgurk Takes Flaying Catch: ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ 10వ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.

Video: వామ్మో.. గాల్లోకి ఎగిరి బౌండరీ లైన్‌లో కళ్ల చెదిరే క్యాచ్.. వీడియో చూస్తే ఫిదానే
Jake Fraser Mcgurk Takes Flaying Catch

Updated on: Mar 30, 2025 | 8:18 PM

Jake Fraser Mcgurk Takes Flaying Catch: ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ 10వ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 163 ​​పరుగులు చేసింది. అనికేత్ వర్మ 74 పరుగులు తప్ప మరెవరూ హైదరాబాద్ జట్టు తరపున చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు. అయితే, జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ అనికేత్ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్‌ను తీసుకోకపోతే, హైదరాబాద్ భారీ స్కోరు నమోదు చేసే అవకాశం ఉండేది. కానీ, కుల్దీప్ యాదవ్ ఈ డేజంరస్ ప్లేయర్‌కు ముగింపు పలికాడు.

ఇవి కూడా చదవండి

అర్ధ సెంచరీతో దూసుకెళ్తోన్న అనికేత్ వర్మను కుల్దీప్ యాదవ్ అవుట్ చేసి సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఎనిమిదో షాక్ ఇచ్చాడు. 40 బంతుల్లో 74 పరుగులతో ఆడుతున్న అనికేత్.. కుల్దీప్ వేసిన బంతిని మిడ్-వికెట్ వైపు ఆడి సిక్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ, బౌండరీ లైన్‌లో ఉన్న జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ గాల్లోకి దూకి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో అనికేత్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేసిన అనికేత్ వర్మ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

ఇరు జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(కీపర్), కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..