Virat Kohli: క్రికెట్‌లో కింగ్.. మరి చదువులో! విరాట్ కోహ్లీకి పదో తరగతిలో ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా?

విరాట్ కోహ్లీ.. క్రికెట్ లో తిరుగులేని రారాజు. వన్డే, టెస్ట్,టీ20.. ఏ ఫార్మాటైనా కింగ్ బరిలోకి దిగాడంటే రికార్డులు బద్దలు కావాల్సిందే. అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న కింగ్ కోహ్లీ చదువులో ఎంతటి ఘనాపాఠియో తెలుసుకుందాం రండి.

Virat Kohli: క్రికెట్‌లో కింగ్.. మరి చదువులో! విరాట్ కోహ్లీకి పదో తరగతిలో ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా?
Virat Kohli

Updated on: Apr 20, 2025 | 2:29 PM

కింగ్ కోహ్లీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అండర్-19 ప్రపంచకప్ మొదలు మొన్నటి ఛాంపియన్స్ ట్రోఫీ దాకా కోహ్లీ ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తి దాయకం. ఈ సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో ఎన్నో చెరిగిపోని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడీ రన్ మెషిన్. ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును విజేతగా నిలిపేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నాడు. ప్రొఫెషనల్ లైఫ్ సంగతి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లోనూ ఎంతో ఓపెన్ గా ఉంటాడు కింగ్ కోహ్లీ. తన భర్త, పిల్లలు, ఫ్యామిలీ.. ఇలా అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంటాడు. అలాగే పలు ఆసక్తికరమైన ఫొటోలను అందులో పంచుకుంటుంటాడు. ఈ క్రమంలోనే 2023లో కోహ్లీ తన పదో తరగతి మార్కుల షీట్‌ను ‘కూ’ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశాడు. అందులో కోహ్లీ సేవియర్ కాన్వెంట్ స్కూల్ లో పదో తరగతి పూర్తి చేసినట్లు ఉంది. అలాగే తల్లి పేరు సరోజ్ కోహ్లీ కాగా, తండ్రి పేరు ప్రేమ్ నాథ్ కోహ్లీగా ఉంది. ఇక మార్కుల విషయానికి వస్తే.. ఇంగ్లిష్ ‌లో 83, హిందీలో 75, మ్యాథ్స్‌లో 51, సైన్స్‌లో 55, సోషల్ సైన్స్‌లో 81, ఇంట్రడక్షన్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 74 మార్కులు వచ్చాయి. అంటే టోటల్ స్కోర్ 69.8 శాతం.

 

ఇవి కూడా చదవండి

కింగ్ కోహ్లీ పదో తరగతి మార్కుల మెమో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన క్రికెట్ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘కోహ్లీకి మ్యాథ్స్‌లో ఇంత తక్కువ మార్కులా? మన బ్యాచే’ అని ఫన్నీగా స్పందిస్తున్నారు. అలాగే విరాట్ కోహ్లీకి పదో తరగతిలో మంచి మార్కులు రాకపోయినా, క్రికెట్ లో నంబర్ 1 అయ్యాడు. అతనికి ఎక్కువ మార్కులు రాకపోయినా, అతని పట్టుదల, కష్టించే తత్వం అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి’ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల మెమో..

 

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..