
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌లో భాగంగా చెపాక్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఎప్పటిలాగే చెపాక్ లో ఆర్సీబీపై చెన్నైదే పైచేయి అయింది. గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఈ మ్యాచ్ ద్వారా చాలా రోజుల తర్వాత పాత స్నేహితులు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ మళ్లీ క్రికెట్ మైదానంలో కలిశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. బ్యాటింగ్ ప్రారంభంకావడానికి ముందే కోహ్లీ, ధోనీ ఒకరినొకరు కలిశారు. ఇద్దరూ కౌగిలించుకుని ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని కాసేపు మాట్లాడుకున్నారు. విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫోటోలు, వీడియోలు నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ‘ఇది కదా సలార్ స్నేహమంటే’ అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కాగా ధోని- కోహ్లీలిద్దరూ చివరిసారిగా ఐపీఎల్ 2022లో తలపడ్డారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ పెద్దగా స్కోరు చేయలేదు. 20 బంతుల్లో 1 సిక్స్ సహాయంతో కేవలం 21 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్సీబీ కూడా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ మరో మైలురాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 12000 పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాటర్ గా నిలిచాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఆరో స్థానంలో ఉన్నాడు. అతను 377 మ్యాచ్‌ల్లో 12000 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 8 సెంచరీలు, 91 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో ఏడు సెంచరీలు, టీ20లో ఒక సెంచరీ సాధించాడు. అలాగే టీ20ల్లో విరాట్ కోహ్లీ 4037 పరుగులు చేశాడు. అతను IPL, ఐపీఎల్ చరిత్రలో టీ20 లీగ్‌లో 7000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ కోహ్లీనే.
MS DHONI – VIRAT KOHLI MOMENT 👌
– The love & respect between two greats of the game is touching. pic.twitter.com/268TECVn4U
— Johns. (@CricCrazyJohns) March 22, 2024
Virat Kohli and MS Dhoni hug after the match. ❤️
– The mandatory Mahirat content we all waited for! 🐐pic.twitter.com/vpiEjaS0dq
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024
Virat Kohli with MS Dhoni.
– Moment of the day. ❤️ pic.twitter.com/k4ADSMSkaw
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..