Virat Kohli – Gautam Gambhir: IPL 2024లో బెంగళూరు వర్సెస్ కోల్‌కతా (RCB vs KKR) మధ్య జరిగిన మ్యాచ్‌లో, అభిమానులు బహుశా అస్సలు మరిచలిపోలేరు. RCB ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఒకరినొకరు కౌగిలించుకోవడం కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇది కేవలం నటన అని, దీనికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ బాంబ్ పేల్చాడు.
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య రెండుసార్లు వాగ్వాదం జరిగింది. గంభీర్ కేకేఆర్ కెప్టెన్‌గా, విరాట్ కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు తొలిసారి ఇద్దరు ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. గత సీజన్‌లో కూడా, గౌతమ్ గంభీర్ KKR మెంటార్‌గా ఉన్నప్పుడు, మ్యాచ్ తర్వాత మైదానంలో ఇద్దరు దిగ్గజాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ కారణంగా, KKR వర్సెస్ RCB మధ్య మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందోనని అంతా ఎదురుచూసేవారు. కానీ, ఈసారి మాత్రం అలా జరగలేదు.
— Sitaraman (@Sitaraman112971) March 29, 2024
అయితే, ఈసారి మ్యాచ్‌లో అలాంటిదేమీ జరగలేదు. RCB ఇన్నింగ్స్ సమయంలో, అభిమానులు ఎవరూ ఊహించని దృశ్యాన్ని చూశారు. నిజానికి, టైమ్ అవుట్ బ్రేక్ సమయంలో గంభీర్ తన జట్టు ఆటగాళ్లతో మాట్లాడేందుకు మైదానానికి వచ్చాడు. ఇంతలో గంభీర్, కోహ్లీ కరచాలనం తర్వాత ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అప్పుడు వారి మధ్య కొంతసేపు సంభాషణ జరిగింది. ఈ సమయంలో వారిద్దరూ చాలా మంచి మూడ్‌లో కనిపించారు.
గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీలపై సునీల్ గవాస్కర్ విరుచుకుపడ్డాడు. ఇద్దరు ఆటగాళ్ల వీడియోకు సంబంధించి వ్యాఖ్యానంలో కూడా ప్రతిచర్యలు కనిపించాయి. దీంతో కేకేఆర్‌కు ఫెయిర్ ప్లే అవార్డు రావాలని రవిశాస్త్రి సూచించగా.. దీనిపై సునీల్ గవాస్కర్ వ్యంగ్యంగా స్పందించారు. ఫెయిర్‌ప్లే అవార్డ్ మాత్రమే కాకుండా ఆస్కార్ కూడా అందించాలి అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..