IPL 2024: బెన్ స్టోక్స్ తర్వాత చెన్నై జట్టుకు మరో బిగ్ షాక్.. మరో విదేశీ ఆటగాడు ఔట్..!
IPL 2024: ప్లేయర్ ట్రేడింగ్ విండో నియమం ద్వారా కొంతమంది ఆటగాళ్లను ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ జట్టులో చేర్చుకున్నాయి. ఇప్పుడు బయటకు వచ్చిన ధృవీకరించిన సమాచారం ప్రకారం, ఐపీఎల్ 16వ ఎడిషన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్ (Dwaine Pretorius)ను జట్టు నుంచి తప్పించాలని నిర్ణయించుకుంది.

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ ఎడిషన్ ఆటగాళ్ల మినీ వేలం డిసెంబర్ 19న జరగనుంది. అంతకు ముందు, మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాను నవంబర్ 26 సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాల్సి ఉంది. ఇప్పటివరకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. చాలా ఫ్రాంచైజీలు తమ స్టార్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నాయి. దీనితో పాటు, ప్లేయర్ ట్రేడింగ్ విండో నియమం ద్వారా కొంతమంది ఆటగాళ్లను ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ జట్టులో చేర్చుకున్నాయి. ఇప్పుడు బయటకు వచ్చిన ధృవీకరించిన సమాచారం ప్రకారం, ఐపీఎల్ 16వ ఎడిషన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్ (Dwaine Pretorius)ను జట్టు నుంచి తప్పించాలని నిర్ణయించుకుంది.
ప్రిటోరియస్ ఔట్..
ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున డ్వేన్ ప్రిటోరియస్ కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. ప్రిటోరియస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. జట్టుకు దూరంగా ఉండటం గురించి ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ప్రిటోరియస్, ఈ సమయంలో తనకు మద్దతు ఇచ్చినందుకు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్, కోచ్, ఆటగాళ్లు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
2022లో జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఆటగాడిని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. చెన్నై జట్టులో చేరిన తర్వాత ప్రిటోరియస్‌కు కేవలం 7 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడే అవకాశం లభించింది. అందులో అతను 11 సగటుతో 44 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, కేవలం 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
బెన్ స్టోక్స్ IPL నుంచి రిటైర్మైంట్..
View this post on Instagram
బెన్ స్టోక్స్ ఇప్పటికే ఆటగాళ్ల వేలం తదుపరి ఎడిషన్‌కు ముందే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాబట్టి, స్టోక్స్‌ను కూడా చెన్నై విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే, బెన్ స్టోక్స్‌ను జట్టు నుంచి తప్పిస్తే సీఎస్‌కే రూ.16.25 కోట్లు అందుకుంటుంది. వేలంలో తమ జట్టుకు అవసరమైన ఆటగాడిని కొనుగోలు చేసేందుకు ఈ మొత్తం సహకరిస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




