ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్‌కు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. టోర్నీ షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ 2024 భారత్‌లో జరుగుతుందా లేదా అనే సందేహం నెలకొంది. అయితే ఈ టోర్నీ పూర్తిగా భారత్‌లోనే జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. అలాగే IPL ప్రారంభ తేదీని కూడా వెల్లడించాడు. ANIతో ఇంటరాక్షన్‌లో అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ IPL 2024 టోర్నమెంట్‌ను మార్చి 22న చెన్నైలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. టోర్నీ తొలి 15 రోజుల షెడ్యూల్‌ను ప్రారంభంలోనే ప్రకటిస్తారు. ఆ తర్వాతి మ్యాచ్ ల షెడ్యూల్‌ను మళ్లీ ప్రకటిస్తారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దశల వారీగా ధనాధాన్ లీగ్‌ను నిర్వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి.
దశల వారీగా ఐపీఎల్ మ్యాచ్ లు..
IPL 2024 ప్రారంభ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. తద్వారా రెండు బలమైన జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరగనుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఐపీఎల్‌ను విదేశాలకు తరలించవచ్చని అందరూ అన్నారు. అలాగే డేట్స్‌లో కూడా కొంత మార్పు ఉండొచ్చని అంటున్నారు. తొలుత ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్‌ను వెల్లడించనున్నారు. అనంతరం ఎన్నికల తేదీల ప్రకారం తుది షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఐపీఎల్ 2024 ఫైనల్ మే 26న జరగనుంది.ఈరోజు విడుదలయ్యే IPL 2024 షెడ్యూల్‌ను కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. సాయంత్రం 5 గంటలకు ఈ ధనాధాన్ లీగ్ షెడ్యూల్ రిలీజ్ కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ టెలికాస్ట్ చూడవచ్చు. అలాగే Jio సినిమా యాప్‌లో ఉచితంగా చూడవచ్చు.
IPL 2024 updates (Cricbuzz):
– IPL to kick off from 22nd March.
– CSK will play the opening match in Chennai.
– An opening ceremony will be organised.
– The final will be played on 26th May.#IPL2024 #MSDhoni #ViratKohli #IPL #CSKvsGT pic.twitter.com/ndwUChjum8— CharanBehara (@CharanBehara3) February 22, 2024
The BCCI to announce the schedule for the first 15 days of IPL tomorrow.
– Catch it live on Star Sports from 5pm. pic.twitter.com/tSSpNcsTpl
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 21, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..