Video: సచిన్ కొడుకు దెబ్బకు క్రీజులోనే కుప్పకూలిన టీమిండియా క్రికెటర్.. ఐపీఎల్‌కు ముందే దడ పుట్టించాడుగా..

Arjun Tendulkar vs Ishan Kishan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మార్చి 22 నుంచి IPL 2024 మొదలుకానుంది. దీనికి ముందు, అన్ని ఫ్రాంచైజీలు లీగ్‌కు సిద్ధమవుతున్నాయి. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కూడా మైదానంలో చెమటలు పట్టిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా సోమవారం ఎంఐ క్యాంపులో చేరాడు. భారత జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ కూడా దేశవాళీ క్రికెట్‌ను పట్టించుకోకుండా చాలా కాలంగా ఐపీఎల్ 2024 సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు.

Video: సచిన్ కొడుకు దెబ్బకు క్రీజులోనే కుప్పకూలిన టీమిండియా క్రికెటర్.. ఐపీఎల్‌కు ముందే దడ పుట్టించాడుగా..
Arjun Tendulkar, Ishan Kish

Updated on: Mar 12, 2024 | 8:30 PM

IPL 2024, Arjun Tendulkar, Ishan Kishan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మార్చి 22 నుంచి IPL 2024 మొదలుకానుంది. దీనికి ముందు, అన్ని ఫ్రాంచైజీలు లీగ్‌కు సిద్ధమవుతున్నాయి. అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను సన్నద్ధం చేశాయి. ఒక్కొక్కరుగా జట్టులో చేరుతున్నారు. అలాగే, నిన్న ముంబై జట్టు కూడా ఒక్కచోటు చేరింది. తమ అస్త్రశస్తాలకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు. కొత్త కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగననున్న ముంబై జట్టు.. మరోసారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకునేందుకు సిద్ధమైంది.

హార్దిక్ రాకతో ప్రాక్టీస్ షురూ..

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కూడా మైదానంలో చెమటలు పట్టిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా సోమవారం ఎంఐ క్యాంపులో చేరాడు. భారత జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ కూడా దేశవాళీ క్రికెట్‌ను పట్టించుకోకుండా చాలా కాలంగా ఐపీఎల్ 2024 సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు.

అర్జున్ దెబ్బకు పడిపోయిన ఇషాన్..

ముంబై ఆటగాళ్లు అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తన పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే, అర్జున్ బౌలింగ్‌ను ఎదుర్కొన్న టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ మాత్రం తేలిపోయాడు. అర్జున్ వేసిన బంతిని ఎదుర్కొనలేక క్రీజు ముందు పడిపోయాడు. అసలు అర్జున్ వేసిన ఓవర్‌ను ఆడలేక నానా ఇబ్బందులు పడ్డాడు. ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అర్జున్ టెండూల్కర్ వేసిన బంతికి ఇషాన్ కిషన్ కిందపడడం చూడొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..