
Royal Challengers Bengaluru: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో RCB కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. కేకేఆర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం చివరి వరకు పోరాడిన ఆర్సీబీ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు RCBకి ఆఖరి బంతికి 3 పరుగులు అవసరం. కానీ లాకీ ఫెర్గూసన్ చివరి బంతికి కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించగలిగాడు. ఐపీఎల్ 2024 లీగ్‌లో ఆర్సీబీకి ఇది వరుసగా ఆరో ఓటమి. ఓవరాల్‌గా ఏడో పరాజయం. దీంతో దాదాపు ప్లేఆఫ్ రేసు నుండి RCB నిష్క్రమించినట్లే. దీంతో ‘ఈ సాల కప్ నమ్దే’ అంటూ ఎదురుచూసిన ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆర్సీబీ జట్టు 221 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో విల్ జాక్స్, రజత్ పాటిదార్ల సెంచరీ భాగస్వామ్యం తో ఒకానొక దశలో ఆర్సీబీ గెలిచేలా కనిపించింది. అయితే మరోసారి బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టును దెబ్బ తీసింది. దీనికి కేకేఆర్ బౌలర్ల అద్భుత బౌలింగ్ ఎటాక్ కూడా ప్రధాన కారణమైంది. ఆర్సీబీ విజయం కోసం చివరి వరకు పోరాడినా అదృష్టం లేకపోవడంతో పరాజయం తప్పలేదు.
We feel you, Karn. 🥺❤️🩹
Please keep your head high, you were unbelievable! 🫡#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #KKRvRCB @sharmakarn03 pic.twitter.com/hFizdmgEid
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 21, 2024
కేకేఆర్ చేతిలో ఓడిపోవడంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌కు దాదాపు దూరమైనట్లే. ఎందుకంటే ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే జట్టు కనీసం 8 మ్యాచ్‌లు గెలిచి 16 పాయింట్లు సంపాదించాలి. అప్పుడే జట్టు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లేఆఫ్ స్థానాన్ని కైవసం చేసుకోగలదు. కానీ RCB ఇప్పటికే 8 మ్యాచ్‌లు ఆడి 7 మ్యాచ్‌లు ఓడి 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. అంటే RCB ఖాతాలో కేవలం 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన 6 మ్యాచ్‌లు గెలిచినా RCBకి 14 పాయింట్లు మాత్రమే ఉంటాయి. దీంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌కు వెళ్లడం అసాధ్యం.
Virat Kohli’s reaction on a 1 run defeat against KKR.#ViratKohli #butrcb #rcbrcb #umpire #royalchallengersbengaluru #ไบร์ทเนเน่ #KKRvRCB pic.twitter.com/TOaQegiAoG
— BGP (@BhavithGowda9) April 21, 2024
7 మ్యాచ్‌ల్లో ఓడిన ఆర్సీబీ ప్లేఆఫ్‌లోకి వెళ్లాలంటే అద్భుతం జరగాలి. అయితే లెక్క ప్రకారం ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరుకోవచ్చు. కానీ RCB ప్రస్తుత ఫామ్ చూస్తుంటే అది అసాధ్యం. ఎందుకంటే RCBకి మిగిలిన 6 మ్యాచ్‌లు గెలిస్తే సరిపోదు. ఈ ఆరింట్లోనూ భారీ విజయాలు కావాలి. నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండాలి. అంతేకాదు పాయింట్ల పట్టికలో టాప్ 6 స్థానాల్లో ఉన్న జట్లు కనీసం 6 మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అప్పుడే RCB ప్లేఆఫ్స్‌కు వెళ్లగలదు. కానీ ప్రస్తుతం టాప్ 6లో ఉన్న జట్ల ప్రదర్శనను పరిశీలిస్తే ఇవన్నీ జరగడం దాదాపు అసాధ్యం..
Sport always wins. 🤝#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #KKRvRCB pic.twitter.com/DpKCOfcvqi
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 21, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..