
IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 23వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ బ్యాట్ రాణించలేదు. అయినప్పటికీ, అతను ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీకి దగ్గరగా వచ్చాడు. పంజాబ్‌పై క్లాసెన్ 9 పరుగులు మాత్రమే చేశాడు. ఈ తొమ్మిది పరుగుల ఇన్నింగ్స్ ఆధారంగా, అతను ఆరెంజ్ క్యాప్ రేసులో భారీ ఎత్తుకు దూసుకెళ్లాడు. నేరుగా 7వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకున్నాడు.
ఈ రేసులో కోహ్లి నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం క్లాసెన్ తనకు అత్యంత చేరువైనప్పటికీ, కోహ్లి స్థాయికి క్లాసెన్ చేరడం అంత సులువు కాదు. కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీకి, క్లాసెన్ మధ్య పరుగుల వ్యత్యాసం కూడా భారీగా ఉంది. కోహ్లి 5 మ్యాచ్‌ల్లో 316 పరుగులు చేశాడు. కాగా క్లాసెన్ 5 మ్యాచ్‌ల్లో 186 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఈ రన్ మెషీన్ 5 మ్యాచ్‌ల్లో 316 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. అతని బ్యాట్ నుంచి ఇప్పటివరకు 29 ఫోర్లు, 12 సిక్సర్లు వచ్చాయి.
బి సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్): గుజరాత్ టైటాన్స్‌కు చెందిన సాయి సుదర్శన్ 5 మ్యాచ్‌ల్లో 191 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.
హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ 7వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకున్నాడు. అతను 5 మ్యాచ్‌ల్లో 186 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.
రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్): రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ ఈ రేసులో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 4 మ్యాచ్‌ల్లో 185 పరుగులు చేశాడు, ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.
శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్): ఆరెంజ్ క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐదో స్థానంలో ఉన్నాడు. అతను 5 మ్యాచ్‌లలో 183 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..