Video: కెమెరా‌మెన్‌కు ఇచ్చిపడేసిన ధోని.. ఏకంగా బాటిల్‌తో.. వైరల్ వీడియో

IPL 2024: ఈ కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన లక్నో సూపర్‌జెయింట్స్‌కు మార్కస్ స్టోయినిస్ తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. అద్భుతమై ఆటతో చెలరేగిన స్టోయినిస్ 63 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 13 ఫోర్లతో అజేయంగా 124 పరుగులు చేశాడు. ఈ తుఫాన్ బ్యాటింగ్‌తో లక్నో సూపర్‌జెయింట్‌ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Video: కెమెరా‌మెన్‌కు ఇచ్చిపడేసిన ధోని.. ఏకంగా బాటిల్‌తో.. వైరల్ వీడియో
Ms Dhoni Viral Video

Updated on: Apr 24, 2024 | 11:55 AM

MS Dhoni Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 లో 39వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్‌తో తలపడింది. చెన్నై చెపాక్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో ధోని వాటర్ బాటిల్‌తో కెమెరామెన్‌పై విరుచుకపడ్డాడు. 17వ ఓవర్‌లో ఎంఎస్ ధోని డ్రెస్సింగ్ రూమ్‌లో నిలబడి బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. కెమెరామెన్ ధోనిని పెద్ద స్క్రీన్‌పై చూపించడంపై దృష్టి సారించాడు.

ధోని బుల్లితెరపై కనిపించడంతో అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. దీన్ని గమనించిన ధోని వాటర్ బాటిల్‌ను కెమెరాపైకి విసురుతున్నట్లు కనిపించాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

సూపర్ జెయింట్స్‌కు సూపర్ కింగ్స్ విజయం..

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే తరపున రుతురాజ్ గైక్వాడ్ (108) సెంచరీ సాధించాడు. ఈ సెంచరీ సాయంతో సీఎస్‌కే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

ఈ కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన లక్నో సూపర్‌జెయింట్స్‌కు మార్కస్ స్టోయినిస్ తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. అద్భుతమై ఆటతో చెలరేగిన స్టోయినిస్ 63 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 13 ఫోర్లతో అజేయంగా 124 పరుగులు చేశాడు. ఈ తుఫాన్ బ్యాటింగ్‌తో లక్నో సూపర్‌జెయింట్‌ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us