IPL 2024: కాసుల వర్షం కురవాల్సిందే.. ప్రపంచ కప్‌ హీరోలపై ఐపీఎల్‌ ఫ్రాంచైజీల కన్ను.. లిస్టులో ఎవరున్నారంటే?

|

Nov 27, 2023 | 6:50 AM

IPL 2024 వేలానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ ట్రేడింగ్‌ విండోలో భాగంగా ఇప్పటి వరకు అన్ని జట్లు తమ ఆటగాళ్లను మార్చుకున్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19న వేలం జరగనుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ వేలం దుబాయ్‌లో జరగనుంది. ఈ వేలంలో చాలా మంది ఆటగాళ్లు ఉండబోతున్నారు. వీరిపై కాసుల వర్షం కురవనుందని తెలుస్తోంది.

IPL 2024: కాసుల వర్షం కురవాల్సిందే.. ప్రపంచ కప్‌ హీరోలపై ఐపీఎల్‌ ఫ్రాంచైజీల కన్ను..  లిస్టులో ఎవరున్నారంటే?
World Cup 2023 Players
Follow us on

IPL 2024 వేలానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ ట్రేడింగ్‌ విండోలో భాగంగా ఇప్పటి వరకు అన్ని జట్లు తమ ఆటగాళ్లను మార్చుకున్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19న వేలం జరగనుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ వేలం దుబాయ్‌లో జరగనుంది. ఈ వేలంలో చాలా మంది ఆటగాళ్లు ఉండబోతున్నారు. వీరిపై కాసుల వర్షం కురవనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రపంచ కప్ 2023లో అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ పునరాగమనం చేయడం ఖాయం. అతడిని తమ జట్టులోకి తీసుకోవడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నారు. భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కూడా ప్రపంచకప్ లో పరుగుల వర్షం కురిపించాడు. వీరితో పాటు పలు స్టార్‌ ఆటగాళ్లపై కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి.

ఆసీస్‌ ఆటగాళ్లపైనే దృష్టి..

కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తన నాయకత్వంలో ఆస్ట్రేలియాకు ఆరో ప్రపంచకప్‌ను అందించాడు. ఫైనల్‌ లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియాను ఓడించి మరీ తన జట్టును విశ్వ విజేతగా నిలిపాడు. ఇప్పుడు ఫ్రాంచైజీల దృష్టి కూడా కమిన్స్‌పై పడింది. అలాగే న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ప్రపంచకప్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌లు 2 సార్లు తలపడ్డాయి. లీగ్ రౌండ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించింది. సెమీఫైనల్‌లోనూ దుమ్ము రేపింది. కానీ ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియాపై డారెల్ మిచెల్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ వేలంలో డారెల్ మిచెల్‌ భారీ ధర పలకవచ్చు. వీరితో పాటు గెరాల్డ్ కోయెట్జీ, ట్రావిస్ హెడ్ తదితర ఆటగాళ్లను దక్కించుకోవడానికి ఐపీఎల్ టీమ్స్ పోటీపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

డిసెంబర్‌ 9 న డబ్ల్యూపీఎల్ వేలం

ఇదిలా ఉండగా, WPL రెండో సీజన్ అంటే మహిళల ప్రీమియర్ లీగ్ వేలం డిసెంబర్ 9న జరగనుంది. ముంబైలో ఈ వేలం నిర్వహించనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన WPL సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్‌ చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..