IPL 2024, RCB Vs RR: మోడీ మైదానంలో తగ్గేదేలే అంటోన్న రాజస్థాన్, బెంగళూరు.. రికార్డులు ఇవే..

|

May 22, 2024 | 7:28 AM

IPL 2024 Eliminator: బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియంలో ఇరు జట్ల ప్రదర్శన ఎలా ఉందో ఓసారి చూద్దాం..

1 / 6
ఐపీఎల్ 17వ ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో టేబుల్ టాపర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడడంతో ఇప్పుడు ప్లేఆఫ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించి, ఫైనల్‌కు చేరుకుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండో క్వాలిఫయర్‌లో నేడు గెలిచిన జట్టుతో శుక్రవారం ఢీ కొట్టనుంది.

2 / 6
కాగా, నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

3 / 6
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఎలా రాణించాయో చూస్తే.. నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్‌లు ఆడింది.

4 / 6
ఈ 15 మ్యాచ్‌ల్లో ఆ జట్టు 9 గెలిచి 5 ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై కావడంతో రాజస్థాన్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఛేజింగ్‌లో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మైదానంలో జట్టు అత్యధిక స్కోరు 201 పరుగులు కాగా, అత్యల్ప స్కోరు 102 పరుగులు.

5 / 6
ఈ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రదర్శనను పరిశీలిస్తే... ఈ మైదానంలో ఆర్సీబీ ఇప్పటి వరకు కేవలం 5 మ్యాచ్ లు మాత్రమే ఆడింది. ఇందులో ఆ జట్టు 3 గెలిచి 2 ఓడిపోయింది.

6 / 6
ఈ గ్రౌండ్‌లో RCB మొదట బ్యాటింగ్ చేసినప్పుడు 1 మ్యాచ్‌లో, ఛేజింగ్‌లో 2 మ్యాచ్‌లు గెలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో RCB అత్యధిక స్కోరు 206 పరుగులు, అత్యల్ప స్కోరు 145 పరుగులు.