IPL 2024: సొంతింటి కల సాకారం చేసుకున్న టీమిండియా క్రికెటర్.. ముంబైలో లగ్జరీ ఫ్లాట్.. ఎన్ని కోట్లో తెలుసా?

సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. అందులోనూ ముంబై లాంటి మహా నగరంలో ఇల్లు కొనడం అంటే మామూలు విషయం కాదు. టీమిండియా క్రికెటర్ పృథ్వీషా కూడా ముంబైలో తనకొక సొంతిల్లు ఉండాలని కల గన్నాడు

IPL 2024: సొంతింటి కల సాకారం చేసుకున్న టీమిండియా క్రికెటర్.. ముంబైలో లగ్జరీ ఫ్లాట్.. ఎన్ని కోట్లో తెలుసా?
Prithvi Shaw

Updated on: Apr 10, 2024 | 7:26 PM

సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. అందులోనూ ముంబై లాంటి మహా నగరంలో ఇల్లు కొనడం అంటే మామూలు విషయం కాదు. టీమిండియా క్రికెటర్ పృథ్వీషా కూడా ముంబైలో తనకొక సొంతిల్లు ఉండాలని కల గన్నాడు . ఇప్పుడా కలను సాకారం చేసుకున్నాడు. ఇక పృథ్వీ షా ఐపీఎల్ 17వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. పృథ్వీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 1 అర్ధ సెంచరీ సాధించాడు. పృథ్వీ తన సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై తన ఏకైక హాఫ్ సెంచరీని సాధించాడు. ఐపీఎల్ 17వ సీజన్ సందర్భంగా పృథ్వీ కొత్త ఇంటికి మారాడు. ముంబైలోని బాంద్రా ఏరియాలో పృథ్వీ ఇళ్లు కొన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేశాడీ ఢిల్లీ బ్యాటర్. ‘నా సొంతింటి కలను సాకారం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇల్లు విలాసవంతంగా, ఇంటీరియర్‌ డిజైన్ తో చాలా అందంగా ఉంది’ తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు పృథ్వీ. ఈ ఫోటోల్లో పృథ్వీ షా ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. పృథ్వీ షా ఇంటికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. కాగా ఈ కొత్త ఇంటి ధర సుమారు 16 కోట్ల 50 లక్షలని తెలుస్తోంది.

రూ. 16 కోట్ల తో..

ముంబైలో చిన్నప్పటి నుంచి టాలెంటెడ్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న పృథ్వీ షా స్కూల్ క్రికెట్‌లో 500కి పైగా పరుగులు సాధించాడు. ఆ తర్వాత 2018లో జరిగిన అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. IPL 2023లో పేలవమైన ప్రదర్శన కారణంగా పృథ్వీషాకి తుది జట్టులో చోటు దక్కలేదు.. ఐపీఎల్ 17వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతను మొదటి 2 మ్యాచ్‌ల్లో ఆడలేదు. అయితే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అర్ధ సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. సీఎస్‌కేపై పృథ్వీ షా 27 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టు స్కోరు 191 పరుగులకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుని సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ 2024లో ముంబైపై షా హాఫ్ సెంచరీ సాధించాడు. వాంఖడే స్టేడియంలో 40 బంతుల్లో 66 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

పృథ్వీ షా కొత్త ఇల్లు..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..