
Punjab Kings vs Gujarat Titans Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 37వ మ్యాచ్ లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. పంజాబ్ సొంత గడ్డ ముల్లాన్ పూర్ వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ జట్టు 6 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ జట్టు 4 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సామ్ కర్రన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ టోర్నీలో ఈ రెండు జట్లు తలపడడం ఇది రెండోసారి. ఏప్రిల్ 4న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి విజయానికి 200 పరుగుల టార్గెట్ ను విధించింది. పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి విజయం సాధించింది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు మెరుపు ఇన్నింగ్స్ ను ఆడి పంజాబ్ ను గెలిపించారు.
Match 3️⃣7️⃣ from Mullanpur 🤩
Sam Curran wins the toss and Punjab Kings will bat first 🪙#PBKSvGT #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/3KmmhyfRrA
— JioCinema (@JioCinema) April 21, 2024
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
సామ్ కుర్రాన్ (కెప్టెన్), ప్రభాసిమ్రాన్ సింగ్, రిలే రోసో, లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.
Match 37. Punjab Kings XI: R. Rossouw, P. Singh, S. Curran (c), J. Sharma (wk), L. Livingstone, S. Singh, A. Sharma, H. Brar, H. Patel, K. Rabada, A. Singh https://t.co/avVO2pBYUg #TATAIPL #IPL2024 #PBKSvGT
— IndianPremierLeague (@IPL) April 21, 2024
రాహుల్ చాహర్, విధ్వత్ కావరప్ప, అథర్వ తైడే, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, శివమ్ సింగ్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మ.
సాయి సుదర్శన్, శరత్ BR, మానవ్ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి