CSK vs LSG Preview: సొంతమైదానంలో చెన్నై ఢీ కొట్టనున్న లక్నో.. ఇరుజట్ల రికార్డులు ఇవే..

|

Apr 23, 2024 | 10:15 AM

ప్రస్తుత సీజన్‌లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల తర్వాత, సగటు మొదటి ఇన్నింగ్స్ మొత్తం 170గా నిలిచింది. లక్ష్యాన్ని ఛేదించిన జట్లు రెండు మ్యాచ్‌లు గెలవగా, ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు ఒకటి గెలిచింది. మంచు, ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకుని, టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు. మంగళవారం చెన్నైలో ఉష్ణోగ్రత దాదాపు 35 డిగ్రీల వరకు ఉంటుందని, వర్షం కురిసే అవకాశం లేదని పేర్కొంది.

CSK vs LSG Preview: సొంతమైదానంలో చెన్నై ఢీ కొట్టనున్న లక్నో.. ఇరుజట్ల రికార్డులు ఇవే..
Csk Vs Lsg Preview
Follow us on

Chennai Super Kings vs Lucknow Super Giants, 39th Match:: ఐపీఎల్ 2024 (IPL 2024)లో ఉత్కంఠ మ్యాచ్‌లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కాగా, ఏప్రిల్ 23న సీజన్‌లోని 39వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. CSK vs LSG మ్యాచ్ చెన్నైలోని ఎం. చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఇది చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్. దీంతో ఈ మ్యాచ్‌లో గెలవాలని చెన్నై కోరుకుంటోంది.

చెన్నై జట్టు ఈ సీజన్‌ను అట్టహాసంగా ప్రారంభించింది. దాని ప్రారంభ రెండు మ్యాచ్‌లను గెలుచుకుంది. అయితే ఆ తర్వాత ఐదు మ్యాచ్‌లలో మూడింటిని కోల్పోవలసి వచ్చింది. తద్వారా ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు నమోదు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. అదే సమయంలో, లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. లక్నో జట్టు కూడా అదే సంఖ్యలో పాయింట్లను కలిగి ఉంది. కానీ, ఆ జట్టు ఐదవ స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

17వ సీజన్‌లో తమ చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్‌తో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లక్నో జట్టు హోమ్ గ్రౌండ్ అయిన ఎకానా స్టేడియంలో జరిగింది. ఇక్కడ CSK బ్యాటింగ్ అంత ప్రభావవంతంగా లేదని నిరూపితమైంది. అయితే బౌలింగ్ కూడా పూర్తిగా విఫలమైంది. అయితే, సొంత మైదానంలో చెన్నై జట్టు అద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టుకు ఈ విషయం తేలికని చెప్పలేం.

IPL చరిత్రలో ఇప్పటివరకు, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నాలుగు మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఇందులో లక్నో జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది, ఒక మ్యాచ్ రద్దు అయింది.

ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, శివమ్ దూబే, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, మతిషా పతిరానా, ముస్తాఫిజుర్ రహమాన్.

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కీపర్/కెప్టెన్), క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.

పిచ్, వాతావరణం..

ప్రస్తుత సీజన్‌లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల తర్వాత, సగటు మొదటి ఇన్నింగ్స్ మొత్తం 170గా నిలిచింది. లక్ష్యాన్ని ఛేదించిన జట్లు రెండు మ్యాచ్‌లు గెలవగా, ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు ఒకటి గెలిచింది. మంచు, ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకుని, టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు. మంగళవారం చెన్నైలో ఉష్ణోగ్రత దాదాపు 35 డిగ్రీల వరకు ఉంటుందని, వర్షం కురిసే అవకాశం లేదని పేర్కొంది.

IPL 2024 39వ మ్యాచ్ కోసం ఇరు జట్ల స్క్వాడ్‌లు..

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, శివమ్ దూబే, మహిష్ తీక్ష, మిచెల్ సాంట్నర్, మతిషా పతిరానా, తుషార్ దేశ్‌పాండే, రాజ్‌వర్ధన్ సింగ్ చోడ్జెకర్, ముఖేష్ హంగర్జేకర్.

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), అమిత్ మిశ్రా, ఆయుష్ బదోని, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్, నికోలస్ పూర్రన్, నికోలస్ పూరన్ క్వింటన్ డి కాక్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, శివమ్ మావి, ఎం సిద్ధార్థ్, మాట్ హెన్రీ, అష్టన్ టర్నర్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, షమర్ జోసెఫ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..