IPL 2023: ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో దిగ్గజ ప్లేయర్.. వెంటనే అదిరిపోయే ఆఫరిచ్చిన ఫ్రాంచైజీ..
డ్వేన్ బ్రేవో కీరన్ పొలార్డ్ అడుగుజాడల్లో నడుస్తున్నాడు. డ్వేన్ బ్రావో, అతని సహచర క్రికెటర్ కీరన్ పొలార్డ్ విడుదలైన తర్వాత IPL నుంచి రిటైర్ అయ్యాడు.
వెస్టిండీస్ వెటరన్ ఆల్ రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాడు. దీంతో ఇకనుంచి ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మైదానంలో కనిపించరు. ఐపీఎల్ 2023కి చెన్నై జట్టు అతన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను మినీ వేలంలోనూ తన పేరును నమోదు చేసుకోలేదు. ఇంతలో ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ వెంటనె చెన్నై టీం ఆయనకు ఓ ఆఫర్ అందించింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023)కి బౌలింగ్ కోచ్‌గా డ్వేన్ బ్రావోను నియమించింది. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని ఫ్రాంచైజీ ఐపీఎల్ 2023 ఆటగాడిగా కాకుండా, బౌలింగ్ కోచ్‌గా ఆయన అందుబాటులో ఉండనున్నాడు.
డ్వేన్ బ్రేవో కీరన్ పొలార్డ్ అడుగుజాడల్లో నడుస్తున్నాడు. డ్వేన్ బ్రావో, అతని సహచర క్రికెటర్ కీరన్ పొలార్డ్ విడుదలైన తర్వాత IPL నుంచి రిటైర్ అయ్యాడు. IPL 2023 కొరకు ముంబై ఇండియన్స్ (MI)కి బ్యాటింగ్ కోచ్‌గా మారిన సంగతి తెలిసిందే.
Official Statement ?? @DJBravo47
— Chennai Super Kings (@ChennaiIPL) December 2, 2022
వెస్టిండీస్ వెటరన్ ఆల్ రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావోకు CSK కొత్త బాధ్యతను అప్పగించింది. చెన్నై ఫ్రాంచైజీ అతనిని తమ కొత్త బౌలింగ్ కోచ్‌గా చేసింది. దీంతో ఈ జట్టులోని కొత్త బౌలర్లను బ్రేవో తీర్చిదిద్దుతున్నాడు.
ఐపీఎల్ 2023లో బ్రావో బౌలింగ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈసారి వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఆటగాడిని విడుదల చేసింది. విడుదలైన తర్వాత, బ్రావో వేలానికి తన పేరును కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచి బ్రావో ఇక ఐపీఎల్‌లో కనిపించడం లేదనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. కానీ, CSK మాత్రం బ్రావోను జట్టు నుంచి విడదీయకుండా జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఈ ఛాంపియన్ జట్టులో బ్రావో ఇప్పుడు బౌలింగ్ కోచ్‌గా తన పాత్రను పోషిస్తున్నాడు. అయితే బ్రావో ఇకపై మైదానంలో కనిపించడు. బ్రావో IPL దిగ్గజ బౌలర్లలో ఒకరిగా పేరుగాంచాడు. అతను తన బౌలింగ్‌తో పాటు పేలుడు బ్యాటింగ్‌తో చెన్నైకి అనేక మ్యాచ్‌లను గెలిపించడంలో కీలకంగా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..