Ricky Ponting: ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తున్న అతను ఛాతి నొప్పి బారిన పడ్డాడు.

Ricky Ponting: ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Ricky Ponting
Follow us
Basha Shek

|

Updated on: Dec 02, 2022 | 3:51 PM

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తున్న అతను ఛాతి నొప్పి బారిన పడ్డాడు. దీంతో వెంటనే పాంటింగ్‌కు ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని, ముందు జాగ్రత్తలో భాగంగానే ఆస్పత్రికి తరలించామని అతనితో కామెంటరీ బాధ్యతలు నిర్వహిస్తోన్న సహచరులు తెలిపారు. కాగా 47 ఏళ్ల పాంటింగ్‌ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ‘రికీ పాంటింగ్ తీవ్ర అస్వస్థతతో ఉన్నాడు. ఈరోజు (శుక్రవారం) మిగిలిన మ్యాచ్‌లో అతను కామెంటరీ చేయడం లేదు. అతను త్వరలోనే మళ్లీ మైక్‌ పట్టుకుంటాడు’ అని ఛానెల్‌ 7 ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.

ఆస్ట్రేలియా క్రికెట్‌కు సంబంధించి పాంటింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వన్డే క్రికెట్‌తో పాటు టెస్ట్‌ ఫార్మాట్లోనూ అతను అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అతని సారథ్యంలోనే ఆస్ట్రేలియా మూడు వన్డే ప్రపంచకప్‌లు గెల్చుకుంది. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాంటింగ్‌ ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్‌ కోచ్‌గా ఉంటున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..