IPL 2023: 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి.. ఒకే మ్యాచ్‌లో డబుల్ ధమాకా.. అదేంటంటే?

|

May 19, 2023 | 2:44 PM

Virat Kohli-Heinrich Klaasen: ఐపీఎల్ 2023లో శుక్రవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ ఆతిథ్య హైదరాబాద్‌కు ఘోర పరాజయాన్ని మిగిల్చింది.

IPL 2023: 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి.. ఒకే మ్యాచ్‌లో డబుల్ ధమాకా.. అదేంటంటే?
Kohli Heinrich Klaasen
Follow us on

ఐపీఎల్ 2023లో శుక్రవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ ఆతిథ్య హైదరాబాద్‌కు ఘోర పరాజయాన్ని మిగిల్చింది. అలాగే బెంగళూరుకు ప్లే ఆఫ్స్ రేసులో ఎంట్రీకి అవకాశాలను అందించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లూ తమ తరుపున మ్యాచ్ గెలవాలని తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్ 104 పరుగుల భీకర ఇన్నింగ్స్‌తో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. అనంతరం విజయానికి అవసరమైన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ సాధించాడు. విరాట్ 63 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 4 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి బెంగళూరు విజయం సాధించింది.

ఒక మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు సెంచరీలు..

ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు సాధించారు. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు రెండు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. అయితే ఈ మ్యాచ్ గత రెండు మ్యాచ్‌ల కంటే భిన్నంగా ఉంది. ఎందుకంటే ఈసారి రెండు జట్లలోని ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు సాధించారు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.

ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు..

ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేసిన ఘనత బెంగళూరు బ్యాట్స్‌మెన్స్‌కే సాధ్యపడింది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ 2016 సంవత్సరంలో గుజరాత్ లయన్స్‌పై సెంచరీలు సాధించారు. ఈ సెంచరీలు ఒకే ఇన్నింగ్స్‌లో వచ్చాయి. ఆ తర్వాత, 2019 సంవత్సరంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో జోడీ హైదరాబాద్‌లో RCB తో జరిగిన ఇన్నింగ్స్‌లో సెంచరీలు సాధించారు. ఈ ఫీట్ 16 ఏళ్లలో మూడోసారి జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..