IPL 2023: రీ ఎంట్రీకి సిద్ధమైన యూనివర్సల్ బాస్.. కొత్త అవతారంలో సిక్సర్ కింగ్..

Chris Gayle: వెస్టిండీస్ వెటరన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ఐపీఎల్ 2023లో మరోసారి కనిపించేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఈసారి మాత్రం అతని శైలి భిన్నంగా ఉండనుంది.

IPL 2023: రీ ఎంట్రీకి సిద్ధమైన యూనివర్సల్ బాస్.. కొత్త అవతారంలో సిక్సర్ కింగ్..
Gayle

Updated on: Dec 16, 2022 | 9:35 AM

IPL 2023: వెస్టిండీస్ వెటరన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ మరోసారి ఐపీఎల్ 2023లో పునరాగమనం చేయనున్నాడు. సుదీర్ఘ సిక్సర్లతో ఫేమస్ అయిన క్రిస్ గేల్ ఈసారి డిఫరెంట్ స్టైల్లో ఐపీఎల్‌లో సందడి చేయనున్నాడు. ఈ యూనివర్సల్ బాస్ IPL 2023లో విశ్లేషకుడిగా తిరిగి రానున్నట్లు భావిస్తున్నారు. ఐపీఎల్‌లో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు గేల్.. ప్రస్తుతం మరోసారి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్త కానుంది. గెయిల్ రిటర్న్ గురించి జియో సినిమా ట్వీట్ చేసి సమాచారం అందించింది.

ఐపీఎల్‌లో గేల్ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో 175 పరుగుల ఇన్నింగ్స్‌ను ఎవరూ మర్చిపోలేరు. పుణె వారియర్స్‌పై అతను ఈ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ బ్యాట్స్‌మెన్ ఆడని అత్యధిక ఇన్నింగ్స్ ఇదే కావడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్సర్లు ఉన్నాయి. ఆర్‌సీబీ తరపున గేల్ ఈ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత, బెంగళూర్ బోర్డుపై 263 పరుగులు చేసింది.

ఐపీఎల్ కెరీర్..

గేల్ తన IPL కెరీర్‌లో మొత్తం 142 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్‌లో 39.72 సగటు, 148.96 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 4965 పరుగులు చేశాడు. గేల్ ఐపీఎల్ కెరీర్‌లో 405 ఫోర్లు, 357 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో మొత్తం మూడు జట్లతో ఆడాడు. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. ఈసారి మినీ వేలంలో గేల్‌ ఉండటం చాలా ఉత్కంఠ రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మినీ వేలంలో మొత్తం 87 మంది ఆటగాళ్లకు చోటు..

డిసెంబర్ 23న కొచ్చిలో జరగనున్న మినీ వేలం కోసం మొత్తం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొత్తంగా 405 మంది ఆటగాళ్లను వేలానికి ఖరారు చేశారు. వీరిలో 273 మంది భారతీయులు కాగా, 132 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. IPL అన్ని ఫ్రాంచైజీలతో కలిపి, మొత్తం 87 మంది ఆటగాళ్లలకు ప్లేస్‌ మిగిలే ఉంది. ఇందులో 30 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..