Sanju Samson: వావ్‌.. సంజూ శామ్సన్‌ కళ్లు చెదిరే త్రో.. దెబ్బకు షాక్‌లో పూరన్‌ .. వైరల్‌ వీడియో

ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు కెప్టెన్‌ సంజూశామ్సన్‌ (2). అయితే కీపింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. లక్నో ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు పడగా.. అన్నింటిలో శామ్సన్‌ పాత్ర ఉండడం విశేషం. ఇందులో రెండు రనౌట్లు కాగా ఒకటి క్యాచ్‌ ఔట్‌. ముఖ్యంగా (20 బంతుల్లో 29) వేగంగా ..

Sanju Samson: వావ్‌.. సంజూ శామ్సన్‌ కళ్లు చెదిరే త్రో..  దెబ్బకు షాక్‌లో పూరన్‌ .. వైరల్‌ వీడియో
Sanju Samson

Updated on: Apr 20, 2023 | 6:51 AM

నాలుగేళ్ల తర్వాత సొంత మైదానంలో మ్యాచ్ ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్‌ తగిలింది. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడే బ్యాటర్లు జట్టులో ఉన్నప్పటికీ ఆజట్టు 155 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. బుధవారం గుజరాత్‌ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ జట్టు 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు కెప్టెన్‌ సంజూశామ్సన్‌ (2). అయితే కీపింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. లక్నో ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు పడగా.. అన్నింటిలో శామ్సన్‌ పాత్ర ఉండడం విశేషం. ఇందులో రెండు రనౌట్లు కాగా ఒకటి క్యాచ్‌ ఔట్‌. ముఖ్యంగా (20 బంతుల్లో 29) వేగంగా ఆడుతున్న నికోలస్‌ పూరన్‌ను సంజూ ఔట్‌ చేసిన తీరు మ్యాచ్‌కే హైలెట్‌. ఆ ఓవర్‌ ఐదో బంతిని కృనాల్‌ పాండ్యా ఆడే ప్రయత్నంలో మిస్‌ అయ్యాడు. అయితే సింగిల్‌ కోసం పూరన్‌ ముందుకు పరిగెత్తుకొచ్చాడు. కృనాల్‌ వద్దన్నా రన్‌ తీశాడు. అయితే బంతి చేతిలోకి రావడమే ఆలస్యం.. వెంటనే బుల్లెట్‌ వేగంతో వికెట్లపైకి డైరెక్ట్‌ త్రో వేశాడు ఆర్‌ఆర్‌ వికెట్‌ కీపర్‌. దీంతో నికోలస్‌ క్రీజులోకి రాకముందే వికెట్లు ఎగిరిపడ్డాయి. దీంతో తనను తాను తిట్టుకుంటూ పెవిలియన్‌ బాట పడ్డాడు పూరన్‌.  సంజూ త్రోకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

156 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌ ( 35 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (41 బంతుల్లో 40) మినహా మరెవరూ పెద్దగా రాణించలేదు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (21 బంతుల్లో 26, 4 ఫోర్లు) ఆఖర్లో కొన్ని మెరుపులు మెరిపించినా రాజస్థాన్‌ విజయానికి సరిపోలేదు. మార్కర్‌ స్టొయినిస్‌ (21), (28/2) ఆల్‌రౌండ్‌ ప్రపదర్శనతో లక్నోను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో అతనికే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.
కాగా ఈ సీజన్‌లో లక్నోకు ఇది నాలుగో విజయం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..